సావిత్రిబాయి ఫూలే 191 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. BDSF

సావిత్రిబాయి ఫూలే 191 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. BDSF


ఏపీ పబ్లిక్ న్యూస్: కర్నూల్ జిల్లా: ఆదోని

        స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నందు విద్యార్థినీ విద్యార్థుల సమక్షంలో BDSF తాలూకా సమితి ఆధ్వర్యంలో పూలే సావిత్రి బాయి 191 వ జయంతి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా BDSF రాష్ట్ర కన్వీనర్ రమేష్ మాట్లాడుతూ  తొలి ఉపాధ్యాయినీ  విద్యాభ్యాసం బ్రాహ్మణ అగ్ర కులస్తులు  మాత్రమే విద్యను అభ్యసించేవారు.

ఈ క్రమంలో 1951నాటికి ఫూలే దంపతులు పూణే నగరంలో మూడో  బాలికల పాఠశాలలను ప్రారంభించి మధ్యలో బడి పిల్లలు బడిని మానకుండా వారికి పౌష్టికాహారంతో గృహ వసతి కల్పించారు కల్పించారు.

దళితుల బాలికల కోసం స్త్రీల కోసం రాత్రి బడులను నిర్వహించి విద్యను బోధించేవారు సావిత్రిబాయ్ ఫూలే సంస్కరణోద్యమ మహిళా నేతగా ఉద్యమ మాతృమూర్తిగా మహిళ హక్కు రక్షణకు అనగారిన తరగతుల పిల్లలకు విద్యను బోధించిన తొలి ప్రధానోపాధ్యాయురాలుగా కవిగా గుర్తింపు పొందారు.  అనాధ పిల్లల కోసం శిశు హత్య నిరోధక కేంద్రాలను నడిపారు దేవా 

 దాసి మరియు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించిన ఘనత సావిత్రి బాయ్ ఫూలే అని వారు అన్నారు.

వెనుకబడిన తరగతుల విద్యార్థులకు  దళితులు మరియు ముస్లిం పిల్లలకు విద్యను బోధించిన ఘనత వారికే దక్కిందన్నారు.


కావున సావిత్రిబాయి ఫూలే ఆశయాల సాధనకై నేడు ముస్లిం దళిత ఆదివాసి భజన ఐక్యతకు ప్రత్యేకించి మహిళా పోరాటాలకు ఐక్యం కావాలని వారన్నారు. 

ఈ కార్యక్రమంలో BDSF నాయకులు పవన్, అమిత్, నరేంద్ర, బోయ జో,  హరి, పురుషోత్తం, సలీం భాష, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.