కొవ్వూరు మండలం నందమూరు గ్రామంలో కోళ్లకు కట్టిన కత్తులు, కరోనా నిభందనలు లేవు - యదేచ్చగా నిషేధిత జూదాలు




ఏపీ పబ్లిక్ న్యూస్ : పశ్చిమగోదావరి జిల్లా 

కొవ్వూరు మండలం నందమూరు గ్రామంలోని ఒక వెంచర్ లో  కోడిపందాలు ముసుగులో గుండాట, పేకాట, మూడుముక్కలాట, వంటి జూదాలకు ఏటువంటి పర్మిషన్ లేకుండా జోరుగా సాగుతున్నాయి. 


లోకల్ నాయకులు, అధికారుల అండదండలతో, ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు.

కోడి పందాలలో కోళ్లకు కత్తులు కట్టకుడదనే నిబంధనలను తుంగలో తొక్కి యదేచ్చగా కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తున్నారు.

నిషేధించిన పేకాట, గుండాట, ముడుముక్కలాటలను సైతం నాయకుల అండదండలతో నిర్వహిస్తూ అమాయక ప్రజలను దోచుకుంటున్నారు.


కరోనా నిభందనలు పాటించకుండా నిషేధిత జుదాలు ఎలా నిరహిస్తున్నరని ప్రశ్నించిన విలేకరులపై కొవ్వూరు మండలం నందమూరు గ్రామంలో కోడిపందాల నిర్వహకులు ఏం పిక్కుంటారో పిక్కొండి అంటూ అనుచిత పదజాలంతో దూషించి జులుం ప్రదర్శించారు.

చాపకింద నీరులా కరోనా 3rd వేవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సాంప్రదాయ పద్ధతిలో కేవలం కోడి పందాలు కారోన నిబంధనలకు లోబడి నిర్వహిస్తామని నాయకులు చెబుతున్న అవి కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఈ పందాలు నిర్వాహకులు కారొన నిభందనలు ఏమీ పాటించకుండా వందల మంది జనం ఒకే చోట చేరి ఉండడం కనీసం మాస్క్ లు కూడా లేకుండ ఉంటున్నారు. పండుగ తర్వాత కరోనా కేసులు వ్యాప్తి అధికంగా పెరగడానికి ఈ కోడిపందాల బిరులు, గుండాట, పేకాట, శిబిరాలు కారణంగా కాబోతున్నాయి.