సంక్రాంతికి కోడి పందాలు, పేకాట, గుండాట, అంటూ యువత చెడు మార్గం పట్టవద్దు - సాంప్రదాయ క్రీడలపై ఆసక్తి చూపాలి : నిడదవోలు సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు


ఏపీ పబ్లిక్ న్యూస్ : పశ్చిమ గోదావరి జిల్లా

నిడదవోలు : సంక్రాంతి సందర్భంగా యువత కోడిపందాలు పేకాట గుండారాల వైపు వెళ్లకుండా గ్రామీణ పట్టణ సాంప్రదాయ క్రీడలపై ఆసక్తి చూపాలని సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు యువతను కోరారు ఈ సందర్భంగా యువతతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడి పందాలు నిర్వహించడం చూడటం ప్రోత్సహించడం నేరమని తద్వారా కేసుల్లో ఇరుక్కోవలసి  వస్తుందని చెప్పారు సంక్రాంతి సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించడం ఆడటం ద్వారా యువతకు  మంచి పేరుప్రఖ్యాతులు బహుమతులు వస్తాయని క్రమశిక్షణ అలవాటు అవుతుంది అని కుటుంబం ఉల్లాసంగా గడుపుతారు అన్నారు పండగ పేరుపై చెడు అలవాట్లకు కోడిపందాలు పేకాట గుండాటలు ఆడితే నేరస్తులు అవుతారని తద్వారా డబ్బులు పోగొట్టుకొని కుటుంబం కూడా తీవ్రంగా నష్టపోతారని హితబోధ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వమే అన్ని చోట్ల క్రీడా పోటీలు నిర్వహించాలని జువ్వల రాంబాబు విజ్ఞప్తి చేశారు కోడిపందాల బరులను రాజకీయ నాయకులు గానీ ప్రజాప్రతినిధులు గానీ ప్రోత్సహించ వద్దని ప్రతి పట్టణ గ్రామాల్లో క్రీడాపోటీలను ప్రోత్సహించాలని తద్వారా కోడి పందాలు నిర్వహించడం తగ్గించవచ్చని జువ్వల రాంబాబు విజ్ఞప్తి చేశారు