విద్యార్థి జీవితాలతో చెలగాటం విద్యార్థి జే.ఏ.సీ

విద్యార్థి జీవితాలతో చెలగాటం విద్యార్థి జే.ఏ.సీ



ఏపీ పబ్లిక్ న్యూస్ : కర్నూల్ జిల్లా

ఆదోని పట్టణం నందు స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కళాశాల ఫీజు సంబంధం లేకుండా పరీక్ష ఫీజు కట్టించుకోవాలని ఆదోని విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి జెఎసి గౌరవ సలహాదారుడు ఎస్.కె షబ్బీర్ బాషా, కన్వీనర్: శ్రీనివాసులు, కో కన్వీనర్ :రమేష్, లు మాట్లాడుతూ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కళాశాల ఫీజు కట్టి తేనే పరీక్ష ఫీజు కట్టించుకుని లేకపోతే లేదు అని కళాశాల యజమాన్యం చెప్పడం, చాలా దారుణం అన్నారు. అదేవిధంగా జగనన్న విద్య దీవెన పూర్తిస్థాయిలో ఇంతవరకు కూడా అమలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి గ్రామీణ పేద బడుగు బలహీనవర్గాల విద్యార్థులు అరకొర వసతులతో విద్యను అభ్యసిస్తున్నారు ఇటువంటి తరుణంలో కళాశాల యాజమాన్యం విద్యార్థులకు ఫీజులు కట్టాలని ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్  మాట్లాడుతూ మీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పడంతో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం కళాశాల ఫీజు సంబంధం లేకుండా ఎదవిదిగా పరీక్ష ఫీజులు  కట్టించుకోవడం జరిగింది.  ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు: వీరేష్,మల్లికార్జున,హరి, ఉపేంద్ర,వెంకటేష్,