పేరు గొప్ప ఊరు దిబ్బ - సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు

పేరు గొప్ప ఊరు దిబ్బ - సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు

మురికి కుపాలుగా కొన్నివార్డులు 

కొద్దిపాటి వర్షానికి మోకాలు లోతు ప్రవహిస్తున్న నీరు 

మొదటి రోజు సిపిఐ ప్రజా సర్వేలో రాజమహేంద్రవరం నగర దుస్థితి

సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు వెల్లడి




ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాజమండ్రి నగర సమితి ఆధ్వర్యంలో 27 నుండి సిపిఐ ప్రజా సర్వేను ప్రారంభించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా సహాయ కార్యదర్శి K.రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శులు సప్ప రమణ, బొమ్మసాని రవిచంద్ర, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు కిర్లకృష్ణ, మహిళా సమైక్య నాయకురాలు కే రమాదేవి కూడిన బృందం నాలుగు వార్డులలో పర్యటించారు. అక్కడ ప్రజా సమస్యలను గడపగడపకు తిరిగి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ రాజమహేంద్రవరం పేరు గొప్ప ఊరుదెబ్బ చందంగా ఉందని ఆయన విమర్శించారు. నాలుగు వార్డులలో అనేక సమస్యలను ప్రజలు ఏకరువు పెట్టారని అన్నారు. కొద్దిపాటి కురుస్తున్న వర్షానికి నాగిరెడ్డి కాలనీ మూడు గుళ్ళు మీది ఆల్ కార్డ్ గార్డెన్స్ ఇన్నిస్పేట తాడితోట తదితర ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయమై మోకాళ్ళ లోతు నీరు ఉంటుందని సుమారుగా 750 ఇళ్లల్లోకి మురుగునీరు వెళుతుందని ఆయన తెలిపారు. అలాగే చాలా ప్రాంతాలలో డ్రైనేజీలు కూడా లేవని మధు తెలిపారు. కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీలు రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేసారని మధు ఎద్దేవా చేశారు. నామవరం డి బ్లాక్ గౌతమి నగర్ లో పందులు స్వేర విహారం చేయడంతో అనేకమందికి వ్యాధులు వస్తున్నాయని, చిన్న పిల్లలకు విష జ్వరాలు కూడుకుని ఉన్నాయని ఆయన తెలిపారు. నవంబర్ 3 వరకు సిపిఐ ప్రజా సర్వే జరుగుతుందని అన్ని ప్రజా సమస్యలను తెెలుసుకునీ ఉద్యమ బాట చేపడతామని తెలియజేశారు.