మహిళల కోసం డ్రాప్‌ ఈజీ యాప్‌

మహిళల కోసం డ్రాప్‌ ఈజీ యాప్‌ 

ప్రారంభించిన రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి 


ఏపీ పబ్లిక్ న్యూస్ : రాజమహేంద్రవరం 

ప్రస్తుతం ఉన్న బైక్‌ టాక్సీల తరహాలో కేవలం ప్రత్యేకించి మహిళల కోసం రూపొందించిన ‘‘డ్రాప్‌ ఈజీ’’ ఉమెన్‌ బైక్‌ టాక్సీ రాజమహేంద్రవరంలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఉమెన్‌ బైక్‌ టాక్సీలో కేవలం మహిళలే రైడర్‌గా ఉంటారు... కేవలం మహిళలనే బైక్‌పై ఎక్కించుకుని వారి గమ్యాలకు చేరుస్తారు. ఈ ‘‘డ్రాప్‌ ఈజీ’’ ఉమెన్‌ బైక్‌ టాక్సీ యాప్‌ను రుడా చైర్‌ పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి రుడా కార్యాలయంలో ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ఇప్పటి వరకూ కేవలం జెంట్స్‌ రైడర్లు ఉన్న బైక్‌ టాక్సీలే అందుబాటులో ఉండగా మహిళా బైక్‌ రైడర్లు ఉన్న ఉమెన్‌ బైక్‌ టాక్సీలు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. డ్రాప్‌ ఈజీ పేరిట వచ్చిన ఈ యాప్‌ను ప్రతి మహిళ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు. రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడే మహిళలు ఈ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకుని ఒకచోట నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాలనుకునే మహిళలు బైక్‌ బుక్‌ చేసుకుంటే మహిళ రైడర్‌ మీ వద్దకు వచ్చి గమ్యస్థానానికి చేర్చుతారని వివరించారు. యాప్‌ నిర్వాహకులు వల్లేపు పద్మావతి, పుప్పాల అనురాధ పర్యవేణలో ఈ యాప్‌ ఉంటుందన్నారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ‘‘డ్రాప్‌ ఈజీ’’ ఉమెన్‌ బైక్‌ టాక్సీతో ముందుకు వచ్చిన పద్మావతి, అనురాధలను ఆమె అభినందించారు. యాప్‌ నిర్వాహకులు వల్లేపు పద్మావతి, పుప్పాల అనురాధ, సహాయకులు వల్లేపు దుర్గారావు, పురం మురళి, రోహిత్‌, దీక్షిత మాట్లాడుతూ తమ యాప్‌ పూర్తి భద్రతతో ఉంటుందని, మహిళ బైక్‌ రైడర్లు మాత్రమే ఉంటారు కాబట్టి మహిళలను సురక్షితంగా వారి గమ్యాలకు చేర్చుతారన్నారు. తమ యాప్‌లో రైడర్లుగా వచ్చే వారి పూర్తి వివరాలను, వారి వ్యక్తి గత విషయాలను పూర్తిగా పరిశీలించిన తరువాతే బైక్‌ రైడర్లుగా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇతర బైక్‌ టాక్సీల కంటే తాము కిలో మీటరుకు తక్కువగా ఛార్జీనే చేస్తామన్నారు. వివరాలకు 9515556023, 9515556024 సంప్రదించాలన్నారు. www.dropeasy.in వెబ్ సిట్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. కొత్త ఆశయాలు, ఒరవడికి శ్రీకారం చుట్టిన తమను, తమ యాప్‌ను ప్రోత్సహించాలని వారు కోరారు.