రాష్ట్రస్థాయిలో కిక్ బాక్సింగ్ పోటీల్లో నెల్లూరు జిల్లా విద్యార్థికి సిల్వర్ మెడల్

రాష్ట్రస్థాయిలో కిక్ బాక్సింగ్ పోటీల్లో నెల్లూరు జిల్లా విద్యార్థికి సిల్వర్ మెడల్


ఏపీ పబ్లిక్ న్యూస్ : విశాఖ జిల్లా 

విశాఖపట్నం నగరం ఓల్డ్ డైరీ క్లబ్ నందు ఆంధ్ర ప్రదేశ్ కిక్ బాక్సింగ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 6 వ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్-2022 నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం చెందిన సింహపురి కరాటే అకాడమీ చెందిన దిలీప్ వెంకట సాయి సిల్వర్ మెడల్ సాధించారు. ఈ కిక్ బాక్సింగ్ పోటీల్లో వ్యాకో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా మరియు సింహపురి కరాటి అకాడమీ ఆధ్వర్యంలో ముగ్గురు విద్యార్థులు పాల్గొనగా అందులో దిలీప్ వెంకట సాయి సిల్వర్ మెడల్ సాధించారు. సిల్వర్ మోడల్ సాధించిన దిలీప్ వెంకట్ సాయి కి కిక్ ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ S. దుర్గ మరియు విశాఖపట్నం కార్పొరేటర్ రాజశేఖర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అలాగే చీప్ ఆర్గనైజర్ గా సూపర్ కిక్స్ క్లబ్ వ్యవస్థాపకులు CH. ప్రశాంత్ కుమార్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వాకో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ కోచ్ శివ కుమార్,నెల్లూరు జిల్లా వాకో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కె. ధనుష్ పాల్గొని విద్యార్థులకు సహాయ సహకారాలు అందజేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు కే.ధనుష్, నెల్లూరు జిల్లా కోచ్ శివకుమార్ మాట్లాడుతూ.... సింహపురి కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఇంతకుముందు విద్యార్థులకు కరాటే నేర్పించి అనేక పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించారని తెలిపారు. అలాగే ఇప్పుడు కిక్ బాక్సింగ్ పోటీల్లో మా అకాడమీ తరఫున సిల్వర్ మెడల్ సాధించడం జిల్లాకే కాకుండా రాష్ట్రానికి గర్వకారంగా ఉందని తెలిపారు. ఇంకా భవిష్యత్తులో అనేక పథకాలు సాధిస్తామని ఆయన తెలిపారు.