నిడదవోలులో వికేంద్రీకరణకు మద్దతుగా అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన

నిడదవోలులో వికేంద్రీకరణకు మద్దతుగా అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన



ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

అమరావతి రైతుల మహా పాదయాత్ర అంటూ రాజధాని పేరు మీద జరుగుతున్న భూటకపు యాత్రను మన నిడదవోలు నియోజకవర్గం లోని ప్రజా సంఘాలు, విద్యార్థులు, మహిళలు, ప్రజా ప్రతినిధులు, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి తిప్పి కొట్టారని, రాజధాని వికేంద్రీకరణ జరగాలని, మూడు రాజధానులు కావాలనీ, వికేంద్రీకరణ జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమూలంగా నలువైపులా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ భూటకపు యాత్ర చేస్తున్న వారికి నిడదవోలు ఓవర్ బ్రిడ్జి డౌన్ నుండి గణేష్ చౌక్ వరకు ప్లకార్డు, నల్ల బెలూన్లు, నల్ల బ్యాడ్జీలు, కండువాలతో శాంతియుత నిరసన తెలియజేస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.