"గో"మాంసాన్ని తరలిస్తున్న కంటైనర్ పట్టివేత

"గో"మాంసాన్ని తరలిస్తున్న కంటైనర్ పట్టివేత



ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పుగోదావరి జిల్లా

పాయకరావుపేట : ఆంధ్రప్రదేశ్‌లో ఆవులు, గేదలు, యెద్దులను వడించకుండా జంతు నిరోధక చట్టం ఉంది. ఇందులో పాలు పితికే, గర్భిణీ అయిన ఆవులు, గేదెలు, దూడలు, వ్యవసాయానికి సరిపోయే ఎద్దులను ఉన్నాయి. వాటిని వధించకూడదు. ఇతరాలు ఏవైనా ఉంటే వెటర్నరీ డాక్టర్ అనర్హమైనదిగా ధృవీకరించాలి. వెటర్నరీ డాక్టర్ దృవీకరించకుండా వదించటం చట్టవిరుద్ధం. కానీ ఇప్పటికీ చట్టాన్ని ఉల్లంఘించి ఇతర రాష్ట్రాలకు అనేక అక్రమ రవాణాలు జరుగుతున్నాయి. అక్రమ వధలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి ఒక పెద్ద ట్రక్కు దాదాపు 20 టన్నుల బరువు తో గోమాంసం తీసుకెళుతున్నట్లు గుర్తించబడింది. జంతు ప్రేమికులు, బాధ్యత గలపౌరులు జోక్యం చేసుకుని పోలీసు వారికి సమాచారం అందించారు. జంతు రవాణా నియమాలు, జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం ఇక్కడ కూడా ఉల్లంఘించబడింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. GOI, GOAP LSD (లంపీ స్కిన్ డిసీజ్)ను పరిగణనలోకి తీసుకుని ఎటువంటి పశువుల మార్కెట్‌లను అనుమతించకూడదని, పశువులను ఒకచోట నుండి వేరే జిల్లా, రాష్ట్రాలకు తరలించడాన్ని నిలిపివేయాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఇప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించబడుతున్నాయి. జిల్లాల వారీగా గోశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము.