సెయింట్ ఆన్స్ విద్యార్థులతో "సైన్స్ ఎగ్జిబిషన్"

సెయింట్ ఆన్స్ విద్యార్థులతో "సైన్స్ ఎగ్జిబిషన్"


ఏపీ పబ్లిక్ న్యూస్ :  తూర్పుగోదావరి జిల్లా 

నిడదవోలు సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు తమ విద్యార్థులతో "సైన్స్ ఎగ్జిబిషన్" నిర్వహించారు....

     ఈ ఎగ్జిబిషన్ నందు తొమ్మిది,పది తరగతుల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ,గ్లోబల్ వార్మింగ్,ప్లాస్టిక్ వ్యర్ధాల రీసైక్లింగ్,డ్రిప్ ఇరిగేషన్,సోలార్ ఎనర్జీ, బయో ఫ్యూయల్,సముద్రంలో పేరుకుపోయిన వ్యర్థాలను వెలికి తీసే యంత్రాలు వంటి ప్రయోగాలతో తమలోని సృజనాత్మకతను బయటపెట్టారు......

   ఈ సందర్భంగా సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ సుధారాణి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే అందరూ పర్యావరణ పరిరక్షణపై సరైన అవగాహన పెంపొందించుకోవాలని...తద్వారా అది మానవ జీవనానికి ఎంతగానో ఉపయోగపడుతుందని.....పర్యావరణం,భూమీ,నీరు కలుషితం కాకుండా ఉంటే ప్రజలు ఎటువంటి రోగాల బారిన పడకుండా ఆనందమయ జీవితం గడుపుతారని...

     కాబట్టి అందరూ కలసికట్టుగా చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరారు....ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ ఇంతటి సక్సెస్ కావడానికి సహకరించిన విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులకు సెయింట్ ఆన్స్ యాజమాన్యం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు,అభినందనలు తెలియజేశారు...

    ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణీతలుగా మాంటిసోరి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఫ్రాన్సిస్,మాంటిసోరి ఫిజిక్స్ ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి,సెయింట్ ఆన్స్ కరస్పాండెంట్ రెవ.సిస్టర్ నిర్మల వ్యవహరించారు....

ఈ కార్యక్రమంలో ఫాదర్ బాలస్వామి సెయింట్ ఆన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు...