జర్నలిస్ట్ లపై తప్పుడు కేసులు బనాయించిన వ్యాపారి మురళిపై కేసు నమోదు చేయాలి

జర్నలిస్ట్ లపై తప్పుడు కేసులు బనాయించిన వ్యాపారి మురళిపై కేసు నమోదు చేయాలి

జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద దళిత బహుజన సంఘాల నేతల ఆందోళన.


ఏపీ పబ్లిక్ న్యూస్ : ఏలూరు

ఇటీవల కాలంలో నగరంలోని ఇరువురు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించిన వ్యాపారి యక్కలి.మురళిపై కేసు నమోదు చేయాలని దళిత బహుజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శనివారం ఉదయం జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద దళిత బహుజన సంఘాల నేతల ఆందోళన చేపట్టారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ...

ఇద్దరు విలేకరులపై పక్కా పథకం ప్రకారం ఉద్దేశ్య పూర్వకంగా  పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఈ ఆత్మహత్య డ్రామాను ప్రణాళికా బద్ధంగా రూపొందించిన,మరి కొందరు వ్యాపారులు మాట్లాడుకుంటున్న ఆడియో, వీడియోలతో సహా అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పారు.పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్క దారి పట్టిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.ఆతనికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం జిల్లా ఎస్పీకి దళిత, ప్రజా సంఘాల నాయకులు వినతిపత్రాన్ని వాట్సాప్ లో ఎస్పీకి పంపారు.ఈకార్యక్రమంలో జై భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు గొల్ల.నరేష్, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు సిర్రా భరత్,.జై బీమ్ ఆర్మీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు కోలా.మణి, బీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకపెయ్యి కార్తీక్, బి రమేష్, సిహెచ్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.