అక్టోబర్ 23న ప్రభాస్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెచ్చే "సలార్" బర్తడే గిఫ్ట్

అక్టోబర్ 23న ప్రభాస్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెచ్చే "సలార్" బర్తడే గిఫ్ట్


ఏపీ పబ్లిక్ న్యూస్ : సినిమా 

కేజిఎఫ్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాఫ్ట్స్ కలిసి చేస్తున్న సినిమా సలార్.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ యాక్షన్ సీక్వెన్స్లను మరో లెవల్లో చిత్రీకరిస్తున్నాడట.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.! ఈ న్యూస్ తెలిస్తే ప్రభాస్ ఫాన్స్ కి పిచ్చెక్కి పోవడం ఖాయం..!! అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజున్న సంగతి తెలిసిందే..

ఆరోజు ప్రభాస్ నటించిన సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్ కచ్చితంగా వస్తుంది.. అయితే సలార్ చిత్రం నుంచి కూడా ప్రశాంత్ నిల్ అభిమానులకు ఊహించని విధంగా ఓ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమా లో ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం.. ఆ గ్లింప్స్ లో ప్రభాస్ ను చూస్తే ఆయన అభిమానులకు వచ్చే జోష్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని.. ఆ విధంగా ప్రభాస్ సలార్ గ్లింప్స్ ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట.. అయితే అదే రోజున సలార్ సినిమా నుంచి మొదటి పాటను కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది..

ఈ సినిమాలో ప్రభాస్ శృతి హాసన్ కు సంబంధించిన ఈ ఎంటర్టైనింగ్ వీడియో యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యేవిధంగా లిమిటెడ్ సీన్స్ ను అందులో చూపించనున్నరట.. అదేవిధంగా ఈ సినిమా క్లైమాక్స్ ను ప్రశాంతి నిల్ ఎవ్వరూ ఊహించని విధంగా డిఫరెంట్ జోనర్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. మొత్తానికి రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజుకి సలార్ చిత్రం నుంచి రెండు అప్డేట్స్ రానున్నాయని తెలుస్తోంది.. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఇప్పటినుంచి ఆ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా కోసం సముద్రం మధ్యలో ఓ భారీ ఫైట్ చిత్రీకరణ చేసినట్లు సమాచారం.. ఒకవేళ ఈ ఫైట్ కి సంబంధించిన కొన్ని సీన్స్ లో ప్రభాస్ బర్త్ డే గ్లింప్స్ లో కూడా యాడ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. అదే కనుక నిజమైతే ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ గ్యారంటీ..