ఆడ పిల్లలను ఆదరించడం మనందరి బాధ్యత : సీఆర్పీఎఫ్ సమావేశంలో వక్తలు

ఆడ పిల్లలను ఆదరించడం మనందరి బాధ్యత : సీఆర్పీఎఫ్ సమావేశంలో వక్తలు 



ఏపీ పబ్లిక్ న్యూస్ : పశ్చిమ గోదావరి జిల్లా 

ఉండి : అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉండి పెదపుల్లేరు ఎంపియుపి పాఠశాలలో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం ఆదేశానుసారం పశ్చిమ గోదావరి జిల్లా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా అడహాక్ కన్వీనర్ అరివెల్లి బలరాముడు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాలికలతో పాటు మహిళలకు పెద్దపీట వేశారు.స్థానిక మహిళ ఎంపీటీసీ రావి రాములమ్మ ప్రారంభోపన్యాసం చేశారు.అనంతరం జిల్లా ఫోరం తాత్కాలిక కన్వీనర్ అరివెల్లి బలరాముడు(పాందువ్వ) బాలికలను ఉద్దేశించి మాట్లాడారు, ఆడపిల్లల హక్కులను గుర్తించి మాట్లాడిన మొదటి సమావేశం లో బీజింగ్ డిక్లరేషన్ ప్రాతిపదికన 1995 లో ప్రపంచ మహిళల సదస్సులో అనేక దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయని అన్నారు.ఇది మహిళలకే కాకుండా బాలికల హక్కులను కూడా ముందుకు తీసుకురావడానికి అత్యంత ప్రగతిశీల బ్లూప్రింట్ గా ప్రసిద్ధి చెందిందని బలరాముడు అభివర్ణించారు. 

సీఆర్పీఎఫ్ జిల్లా అడహాక్ సభ్యులు ఉప్పాడ శ్రీనివాస్ మాట్లాడుతూ... అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటారని పిల్లలకు గంగ యమున సరస్వతి గోదావరి క్రిష్ణ నదుల ప్రాముఖ్యతను తెలియచేస్తూ అవన్నీ మహిళలే పేర్లే అని అంతటి శక్తి మీ ఆడపిల్లలకు ఉందని,ఉదహరించారు,బాలికలకు మనందరం సీఆర్పీఎఫ్ తరపున నైతిక భరోసా,అండదండలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

ఫోరం సభ్యులు కట్రెడ్డి ఏడుకొండలు మాట్లాడుతూ మన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కూడా ఓ మహిలే అని ఆమెను ఆదర్శంగా తీసుకొని మీరంతా ఎదగాలంటు మహిళా ప్రాముఖ్యతను వివరించారు,

ఈ కార్యక్రమంలో రావి శ్రీనుబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. విష్ణుమూర్తి, పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్ శివరామరాజు పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.