పవన్ కళ్యాణ్ పై అనపర్తి లో కేసు నమోదు

పవన్ కళ్యాణ్ పై అనపర్తి లో కేసు నమోదు 


ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

జనసేన పవన్ కళ్యాణ్ పై అనపర్తి పోలీస్ స్టేషన్లో కప్లాంట్ చేసిన గవర్నమెంట్ ప్లీడర్

యువతను రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్పుపట్టించే జనసేనపార్టీ సమాజంలో ప్రజలకు సేవ చేయాలంటే వారి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యను నిర్మూలించాలంటే ప్రతిపక్షం దానిని ప్రజలులోనికి తీసుకొని వెళ్ళి ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలిసేలా పోరాడాలి. ప్రజలను చైతన్యవంతం చేయాలంటే శాంతియుతంగా పోరాడాలి. కానీ ది.వి.15-10-2022 తారీఖున ప్రభుత్వం ప్రజలు కలిసి వికేంద్రీకరణ కోసం వైజాగ్ లో ప్రజాహక్కుల కోసం ర్యాలీ చేసి తిరిగి ప్రయాణానికి ఎయిర్ పోర్టుకు మంత్రులందరూ వెళ్ళుచుండగా జనసేన పార్టీకి చెందిన కొందరు అల్లరి మూకలు దాడి. చేయడం మీడియా ద్వారా మనందరికీ తెలుసు కానీ నిన్నటి సమయాన అనగా ది.వి. 18-10-2022న మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టే విధంగాను ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, మంత్రులను అసభ్యపదజాలంతో ముందస్తు ఆలోచనతో మంత్రులను చంపుతానని వారి నాళిక తెగకోస్తానని, చెప్పుతో వారి తాట తీస్తానని ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తూ, రెచ్చగొడుతూ ప్రసంగాలిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని అదుపులోకి తీసుకోవాలని ఇలా భవిష్యత్తులో వేరొకరు కూడా ఇలాంటి తప్పుడు వచనములు పలుకు కుండా ప్రజలు ఎన్నుకున్న నాయకులపై ముందస్తు ఆలోచనతో మనుష్యుల్ని చంపాలనుకోవడం చట్టవిరుద్ధం. దీనిని చూసి యువత తప్పుత్రోవ పట్టకుండా తక్షణమే ఆయన పై చర్య తీసుకోవాలని ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయని పని ఈయన యువతను తప్పుతోవ పట్టిస్తున్నారు.

కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ అనపర్తి పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ వెలగల లక్ష్మీనారాయణ రెడ్డి, కంప్లైంట్ చేసినట్లు తెలిపారు..