వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాల అభివృద్ధి - ప్రజలు సంపూర్ణ మద్దతు

వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాల అభివృద్ధి - ప్రజలు సంపూర్ణ మద్దతు


ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాలు సర్వత్ర ముఖాభివృద్ది చెందుతుందనే ఏకైక సంకల్పంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అన్ని ప్రాంతాల నుండి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో రోటరీ ఆడిటోరియంలో వికేంద్రీకరణకు మద్దతుగా విశ్రాంత ఉద్యోగులు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్యే శ్రీ.జిశ్రీనివాస్ నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

నిడదవోలు ప్రాంతం నుండి రాజకీయ నాయకులు మేధావులు, విద్యావేత్తలు వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు కార్మిక సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు.

వీరంతా ముక్తకంఠంలో సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానులు ఏర్పాటుపై మద్దతు ప్రకటించారు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని పలువురులు ప్రసంగించారు. 

అభివృద్ధి మొత్తం ఒకే ప్రాంతానికి పరిమితమైతే మిగిలిన ప్రాంతాలు నష్టపోతాయని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మా మద్దతు ఉంటుందని ప్రకటించారు.

విద్యా, ఉపాధి, వైద్య, వ్యాపార, వాణిజ్య, రాజకీయ, సామాజిక, పారిశ్రామిక అభివృద్ధి చెంది అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలంటే మూడు ప్రాంతాలను సమానంగా చూస్తే వికేంద్రీకరణ చేపట్టాలని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ అమరావతి ప్రకటించక ముందే రాత్రికి రాత్రే భూములకు రిజిస్ట్రేషన్ లు చేసుకొని టిడిపి నాయకులు వారి కుటుంబ సభ్యులు టిడిపి వర్గీయులు కలిసి భూములను కొనుగోలు చేసుకుని రియల్ ఎస్టేట్ దందాకు తెగబడ్డారన్నారు.

అమరావతిలో రాజధానికి 5000 ఎకరాల కావాలన్నారు. మళ్లీ 35 వేల నుండి 40,000 ఎకరాలు సేకరించారు. అంత భూమి ఎందుకు తీసుకున్నారో చంద్రబాబు రైతులకు సమాధానం చెప్పాలన్నారు.

అయినా రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా సీఎం జగనన్న కౌలు రైతులకు  రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.

ఇప్పుడు రైతులు ముసుగులో అమరావతి రైతు యాత్రను టిడిపి నాయకులే నడిపిస్తున్నారని, నిజమైన రైతులు లేరని ఆయన స్పష్టం చేశారు.

గతంలో మద్రాసు హైదరాబాదుల వల్ల జరిగిన నష్టం పునరావృతం కాకూడదని రాష్ట్ర నలుమూలల అభివృద్ధి జరగాలని సంకల్పంతోనే సీఎం జగన్ మూడురోజుల నిర్ణయం తీసుకున్నారన్నారు.

వికేంద్రీకరణ జరగడం వలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది.

వికేంద్రీకరణ వలన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మారుమూల ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి..

వికేంద్రీకరణ రాజకీయ స్వార్ధం కోసం కాదు..

వికేంద్రీకరణ వలన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగ వృద్ధి తగ్గుతుంది..

వికేంద్రీకరణ వలన పారిశ్రామికంగా ,వాణిజ్య పరంగా, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి..

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఆంధ్రుడికి న్యాయం జరగాలి అన్నది జగన్ ఆలోచన...

ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, నిడదవోలు పట్టణంలోని కిరాణా మర్చంట్స్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఛార్టర్డ్ అకౌంటెంట్ అసోసియేషన్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, వయోవృద్ధుల సంక్షేమ సంఘం, రిటైర్డ్ APNGOs ఎంప్లాయిస్ అసోసియేషన్, రోటరీ క్లబ్ సభ్యులు, కేబుల్ అసోసియేషన్ సభ్యులు, హోటల్స్ అసోసియేషన్, గోల్డ్ అండ్ జ్యువలరీ మర్చంట్స్ అసోసియేషన్, ఇంజనీరింగ్ ఆటోమొబైల్స్ అసోసియేషన్ సభ్యులు, వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ సభ్యులు, వాకర్స్ క్లబ్ సభ్యులు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, పూలు  పళ్ళు వర్తక సంఘం సభ్యులు, పాన్ మరియు స్వీట్ షాప్ అసోసియేషన్ సభ్యులు, నిడదవోలు మెడికల్ షాప్స్ అసోసియేషన్, పౌల్ట్రీ ఫార్మ్ అసోసియేషన్ సభ్యులు, రైతు సంఘ సభ్యులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు