సామాజిక మాధ్యమాలలో ఫేక్ ఫైనాన్స్ కంపెనీల ప్రకటనలు - మోసపోవద్దు అంటున్న పోలీసులు

లోన్ ఇస్తామంటూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు

సామాజిక మాధ్యమాలలో ఫేక్ ఫైనాన్స్ కంపెనీల ప్రకటనలు

ఆర్థిక అవసరాల్లో ఉన్న పేదవారే వీళ్లకు టార్గెట్


ఏపీ పబ్లిక్ న్యూస్ : సైబర్ క్రైమ్ 

నిడదవోలు : ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లలో మీకు పాన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే చాలు లోన్ ఇస్తామంటూ ప్రముఖ ఫైనాన్స్ కంపెనీల పేర్లు వాడుతూ ఫేక్ ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న ఆన్లైన్ కేటుగాళ్లు ఈ ప్రకటనలు చూసి ఆర్థిక అవసరాలలో ఉన్న పేదవారు ఆకర్షితులై వారి వలలో పడిపోతున్నారు ఇంతకీ కేటుగాళ్లు చేసే పని పాన్ కార్డు ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్ బుక్ వాట్సాప్ లో పెట్టమని చెప్పి పెట్టిన పది నిమిషాల్లోనే మీకు లోన్ శాంక్షన్ అయింది అంటూ అప్రూవల్ లెటర్ కూడా వాట్సాప్ లో పిడిఎఫ్ రూపంలో పంపిస్తున్నారు మీకు లోన్ అప్రూవ్ అయింది ఇన్సూరెన్స్ డబ్బులు కట్టమని కట్టిన పది నిమిషాల్లోనే మీ అకౌంట్లో లోను డబ్బులు పడతాయని ఆశ చూపిస్తున్నారు ఇది నమ్మిన ఆర్థిక అవసరాలలొ ఉన్న పేదవారు ఇన్సూరెన్స్ డబ్బులు కడుతున్నారు కట్టిన వెంటనే కేటుగళ్ళు ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేస్తున్నారు లేదా ఫోను ఎత్తి మరి కొంత సొమ్ము చెల్లిస్తే గాని మీకు లోను రాదంటూ చెప్తున్నారు మేము ఇంకా సొమ్ము కట్టలేము మేము కట్టిన సొమ్మును వెనక్కి ఇమ్మని అడిగితే అసభ్య పదజాలంతో కేటుగాళ్లు మోసపోయిన వారిని తిడుతున్నారు ఈ మధ్యన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన సంఘటన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అప్పు కోసం ఎదురుచూస్తున్న ఒక అతను ఇలాగే వీళ్ళ చేతుల్లో మోసపోయాడు అతను చెప్పిన వివరాలు బట్టి ఎయిర్ ఫైనాన్స్ కంపెనీ అని ఆదిత్య బిర్లా గ్రూప్ అనుసంధాన సంస్థ హైదరాబాద్ అని చెప్పి 9851488777 ఈ నెంబర్ తో కాల్ చేసి అతను ను నమ్మించాడు ఇది నమ్మినా అతను ఇన్సూరెన్స్ డబ్బులు ఫోన్ పే చేసి కేటుగాడికి ఫోన్ చేయగా ఆకేటుగాడు తర్వాత మరి కొంత సొమ్ము చెల్లించమని అడిగాడు తను మోసపోయినట్లు గ్రహించిన ఆ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దయచేసి సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లలో వచ్చే ప్రముఖ కంపెనీ పేర్లతో వచ్చే ఇటువంటి ఫేక్ ఫైనాన్స్ ప్రకటనలను నమ్మవద్దని ఇటువంటి ఆర్థిక కేటుగాళ్ల మోసాలను అరికట్టాలని ఇలాంటి వారిని నమ్మి ప్రజలు మోసపోవద్దని వీళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు