పెండ్యాలకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ గొర్తిపాటి రాజు ను అభినందించిన "గాలోడు" సుడిగాలి సుధీర్

మైక్రో ఆర్టిస్ట్ గొర్తిపాటి రాజు ను అభినందించిన "గాలోడు" సుడిగాలి సుధీర్





ఏపీ పబ్లిక్ న్యూస్ : సినిమా 

సుధీర్ ను అమితంగా అభిమానించే తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలు మండలం, పెండ్యాల గ్రామానికి చెందిన గొర్తిపాటి రాజు మైక్రో ఆర్టిస్ట్ గా ఎన్నో ఆవిష్కరణలు చేసి ఎంతో మంది మన్నలను పొందాడు. పెన్సిల్స్ పై ఇండియన్ ప్లెజ్ చెక్కి 2022 సంవత్సరానికి గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నాడు. ఎంతో మంది ప్రముఖలు గొర్తిపాటి రాజు ప్రతిభను గుర్తించి అనేక సందర్భాలలో అభినందలను తెలిపి మైక్రో ఆర్టిస్ట్ కళను ప్రోత్సహించారు. 

సుడిగాలి సుధీర్ మీద ఎంతో అభమానం ఉన్న రాజు తన ప్రతిభతో అభిమానం తెలియచేయాలని "గాలొడు" సినిమా టైటిల్ ను పెన్సిల్ పై చెక్కి హీరో సుధీర్ కు అందించలనుకున్నడు. ఈ ప్రయత్నంలో ఢీ కొరియోగ్రాఫర్ అయిన సాయి ఆకుల దృష్టిలో పడ్డాడు. రాజు టాలెంట్ గుర్తించిన కొరియోగ్రాఫర్ సాయి ఆకుల సుడిగాలి సుధీర్ ను కలిసే అవకాశం కల్పించారు. 

తనపై అభిమానంతో పెన్సిల్ పై "గాలొడు" టైటిల్ చెక్కిన గొర్తిపాటి రాజును చూసి సుధీర్ ఎంతో ఆనందంతో రాజును ఎంతో మంచి భవిష్యత్తు ఉందని అభినందించాడు. తన అభిమాన స్టార్ ను చూసిన ఆనందంతో రాజు మురిసి పోయాడు. సుడిగాలి సుధీర్ అంటే తనకు చాలా ఇష్టమని అభిమానంతోనే పెన్సిల్ పై సినిమా టైటిల్ చెక్కానని సుధీర్ అన్నను కలిసి తను చేసిన మైక్రో ఆర్ట్ ను గిఫ్ట్ గా ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, సుధీర్ అన్నను కలిసే అవకాశం కల్పించిన "ఢీ" కొరియోగ్రాఫర్ సాయి ఆకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసాడు.