రాజమండ్రి ఎయిర్ పోర్టుకి ఎయిర్ బస్, టెర్మినల్ బిల్డింగ్ కు రూ.346 కోట్లు మంజూరు

నా ప్రయత్నం ఫలించింది

రాజమండ్రి ఎయిర్ పోర్టుకి ఎయిర్ బస్, టెర్మినల్ బిల్డింగ్ కు రూ.346 కోట్లు మంజూరు

- రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్

ఏపీ పబ్లిక్ న్యూస్, రాజమహేంద్రవరం:

రాజమండ్రి నగర ప్రజలకు వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ శుభవార్త వెల్లడించారు. గత మూడున్నరేళ్ళుగా నేను దేనికోసమైతే విశ్వప్రయత్నం చేశానో..అది మొత్తంపై సాధించానని మీడియా వద్ద తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టు కు ఒక ఎయిర్ బస్సు, పెద్ద టెర్మినల్ బిల్డింగ్, ఏరో బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయన్నారు. నిన్ననే జరిగిన బోర్డు మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకుని, అందుకు గాను రూ.346 కోట్లు కూడా శాంక్షన్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీనికి సంబంధించి శాంక్షన్ ఆర్డర్స్ రెండు మూడు రోజుల్లో అందుతాయని, రాగానే మీడియాకు అందజేస్తానని చెప్పారు. ‌దీనివల్ల నేరుగా ఎయిర్ బస్సు నుండే ఫ్లైట్ లో అడుగుపెట్టవచ్చునని చెప్పారు.

రాళ్ళబండి మ్యూజియంకు మహర్దశ

రాజమండ్రి నగరంలోని రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియంకు త్వరలోనే మహర్దశ కలగబోతోందని ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. పురావస్తు శాఖకు చెందిన ఈ మ్యూజియం భవనాన్ని ఆధునిక టెక్నాలజీతో నిర్మించేందుకు రూ.10 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపగా ఫస్ట్ ఫేజ్ రూ.4.1కోట్లను కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినట్టు తెలిపారు. ఈ విషయంలో ఐఏఎస్ అధికారిణి డాక్టర్ వాణీ మోహన్ చాలా కృషిచేశారని, ఇందు కోసం స్వయంగా ఆమె ఢిల్లీ వచ్చారన్నారు. రాళ్ళబండి సుబ్బారావు పురావస్తు మ్యూజియంలో దాదాపు 1200 ఎంతో విలువైన పురాతన వస్తువులు ఉన్నాయన్నారు. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ఈ బిల్డింగ్ ధవళేశ్వరం కాటన్ బ్యారేజి మ్యూజియం వద్ద నిర్మించాల లేక ప్రస్తుతం ఉన్న మ్యూజియం స్థలంలోనా అనేది నిర్ణయించవలసి ఉందన్నారు.