నిడదవోలులో అమరజీవి పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి - ఘన నివాళి అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు

నిడదవోలు అమరజీవి పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి - ఘన నివాళి అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు




ఏపీ పబ్లిక్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా

ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

నిడదవోలు పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్ వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి పురస్కరించుకొని వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాము. 

ఈ సందర్భంగా నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ

పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ చిరస్మరణీయులు. 1953, అక్టోబర్‌ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 

తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా నవంబర్‌ 1, 1956న హైదరాబాద్‌ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. ఈ రాష్ట్ర అవతరణకు జరిగిన రాజకీయ పోరాట నేపథ్యాన్ని తలంచుకున్నప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం గుర్తుకు వస్తుంది. 

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నిడదవోలు అధ్యక్షులు కొమ్మని వెంకటేశ్వరరావు కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, కేదారిశెట్టి రవికుమార్, ఆకుతోట సతీష్, కేదారిశెట్టి వెంకటేశ్వరరావు, పెనుగొండ బాబు, నిడదవోలు లోనీ పలు వ్యాపార సంస్థల అధినేతలు, ఆర్యవైశ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, పచ్చిపులుసు ఆదినారాయణ, గ్రంధి సత్య బాలాజీ, పేరిచర్ల సత్యనారాయణ రాజు, కొణిజేటి నారాయణ, మాజేటి నరసింహమూర్తి, గమిని వీరన్న బాబు, వలివేటి సుబ్బారావు, పీ. ఎస్.ఎన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.