చంద్రబాబు నిర్ణయం పట్ల అభినందనలు తెలిపిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కల్లు గీత కార్మిక సంఘ ప్రతినిధులు

చంద్రబాబు నిర్ణయం పట్ల అభినందనలు తెలిపిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కల్లు గీత కార్మిక సంఘ ప్రతినిధులు 


ఏపీ పబ్లిక్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా 

నిడదవోలు మండలం రావిమెట్ల గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలగన సూర్యారావు ఇంటి వద్ద మధ్యాహ్నం 12.00. గంటలకు నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కల్లు గీత కార్మిక సంఘ సమావేశం అధ్యక్షులు మారిశెట్టి వీర వెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గీత కార్మికులు పడే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని సుమారు 2 లక్షల కార్మికులకు లబ్ది చేకూరే విధంగా ప్రభుత్వ వైన్ షాపులలో 20% షాపులను గీత కార్మికులకు వారు నిర్వహించే విధంగా తన నిర్ణయాన్ని ప్రకటించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అమలుచేస్తానని చెప్పిన మీదట గీత కార్మికులు హర్షం వ్యక్తం చేయటం జరిగినది. మనకు ఈ విజయం వెనుక తెలుగునాడు కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేఖా సుధాకర్ గౌడ్, జాతీయ అధ్యక్షులు కొయ్యాడ స్వామిగౌడ్ మరియు అఖిల భారత గౌడ సంగమ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషుల కృషి మరువలేనిదని ఉమ్మడి పశ్చిమ గోదావరి కల్లు గీత కార్మిక సంఘం కొనియాడినది. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలగన సూర్యారావు గౌడ్, నిడదవోలు మండల తెలుగుదేశం పార్టీ BC సెల్ అధ్యక్షులు వాకా సురేష్ గౌడ్, సూరాపురం గ్రామ మాజీ సర్పంచ్ కారింకి దొరయ్య గౌడ్, రావిమెట్ల గ్రామ కల్లు గీత సంఘం అధ్యక్షులు వెలగన లక్ష్మణరావు గౌడ్, కోరుమామిడి గ్రామ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు రాజులపాటి నాగేశ్వరావు గౌడ్, కోరుమామిడి గౌడ సంఘం అధ్యక్షులు కాసాని శ్రీనివాస్ గౌడ్, మట్టా కంచియ్య గౌడ్, వేముల చిన్న శ్రీను గౌడ్, మారిశెట్టి సుబ్బారావు గౌడ్ మొదలైన వారు పాల్గొని మాజీ ముఖ్య మంత్రి నారాచంద్రబాబునాయుడు నిర్ణయం పట్ల అభినందనలు తెలియజేసారు.