జనవరి నుండి ఆంధ్రాలో పెన్షన్ల పెంపు

జనవరి నుండి ఆంధ్రాలో పెన్షన్ల పెంపు

- సీఎం జగన్ నిర్ణయం పట్ల పెన్షన్ దారుల్లో వ్యక్తమవుతున్న హర్షం

- రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్

ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

                   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి పెన్షన్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పెన్షన్‌ను రూ.3వేల వరకూ పెంచుతానని ఎన్నికల్లో జగనన్న ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం పేదల పట్ల జగనన్నకున్న అపార ప్రేమ వెల్లడవుతోందన్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.2,250లకు, రూ.2,500లకు రెండు విడతలుగా పెన్షన్ పెంపుదల చేశారని చెప్పారు. 

ప్రస్తుతం అందిస్తున్న రూ.2,500లను రూ.2,750 లకు పెంచుతూ కీలక నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలపడం శుభపరిణామమని అన్నారు. వచ్చే జనవరి 1న అందనున్న పెన్షన్‌ రూ.2,750లని, 

ఇందుకోసం రూ.130.44 కోట్లు నెలకు అదనపు వ్యయం అవుతుందని ఎంపీ భరత్ చెప్పారు. దీంతో సుమారు నెలకు రూ.1,720 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 62 లక్షల పైచిలుకు పెన్షనర్లు ఉన్నారని, కొత్తగా డిసెంబరులో ఇవ్వనున్న 2.43 లక్షల మందితో కలుపుకుంటే మొత్తం పెన్షనర్ల సంఖ్య 64.74 లక్షలుగా ఎంపీ భరత్ తెలిపారు. దీంతో పెన్షన్లకు నెలకు అందిస్తున్న మొత్తం రూ.1,786 కోట్లని, 

గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో నెలకు పెన్షన్లు కోసం చేసిన ఖర్చు కేవలం రూ.400 కోట్లని చెప్పారు. 

ప్రస్తుతం దీనికి నాలుగున్నరరెట్లు అదనంగా సీఎం వైయస్‌.జగన్‌ ప్రభుత్వం అందిస్తోందని ఎంపీ భరత్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.