చందన చేయూత ట్రస్ట్ & మగ్నా తల్లి పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య & రక్తదాన శిబిరం ఏర్పాటు

చందన చేయూత ట్రస్ట్ & మగ్నా తల్లి పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య & రక్తదాన శిబిరం ఏర్పాటు


ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా

ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం జేగురుపాడు గ్రామంలో మెగా ఉచిత వైద్య & రక్తదాన శిబిరం రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ & గ్రామ సర్పంచ్ స్టాలిన్ గురువారం నాడు ప్రారంబించారు.

మాగ్నా మదర్ & చైల్డ్ హాస్పిటల్ డాక్టర్స్ డాక్టర్ చందన పర్వత వర్ధిని, డాక్టర్ కొండేటి వెంకట దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 250 మంది ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు, వారికి ఉచితంగా పరీక్షలు చేసి మందులను ఉచితంగా అందించారు.

ఈ సందర్భంగా చందన చేయూత ట్రస్ట్ ఛైర్మన్,రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ మాట్లాడుతూ వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహించి ప్రజలకు తమ అమూల్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని త్వరలోనే రాజమండ్రి రూరల్ నియోజకవర్గములో మిగిలిన గ్రామాల్లో ఉచిత మెగా వైద్య శిబిరములు ఏర్పాటు చేస్తామని ప్రజలు అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తల్సేమియా పిల్లల కొరకు రక్తదాన శిబిరంను ఏర్పాటు చేశారు...

ఈ కార్యక్రమంలో జేగురుపాడు ఎంపీటీసీ ఆకుల సుధాకర్, మాజీ ఎంపీటీసీ నాగిరెడ్డి వీర శివాజీ, వుటుకూరి శైలజ, మాజీ సర్పంచ్ వెలుగుబంటి వెంకటాచలం, మండలి వ్యవసాయ ఛైర్మన్ ఈలి గోపాలం, మండల బూత్ కన్వీనర్ తాడల చక్రవర్తి, కట్ట జమిందార్, విప్పర్తీ ఫణి, నాగిరెడ్డి మోహన్, పుట్ట బుజ్జి, కొత్తపల్లి శివాజీ, రత్నం కృష్ణ, కొత్తపల్లి వేంకటేశ్వర్లు,శాప్ డైరక్టర్ భిమిరెడ్డి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు...