చేనేత కార్మికులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తా

చేనేత కార్మికులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తా 

రాజమండ్రి రూరల్ కోఆర్డనేటర్ చందన నాగేశ్వర్ 

ఏపీ పబ్లిక్ న్యూస్ రాజమండ్రి రూరల్:- 

తూర్పు గోదావరి జిల్లా చేనేత సహకార సంఘాల సమాఖ్య కమిటీ అధ్యక్షులు శ్రీ యర్ర సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ కోఆర్డనేటర్ చందన నాగేశ్వర్ కి ఆదివారం నాడు వినతి పత్రాన్ని అందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనెత కార్మికులకు నేతన నేస్తం ద్వారా పథకం ద్వారా కార్మికులకు అండగా ఉందని, చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వము నుండి కొన్ని బకాయిలు చెల్లించాలని వాటిని ప్రభుత్వము దృష్టికి తీసుకువెళ్లి విడుదలయ్యే విధంగా కృషి చేయాలని చందన నాగేశ్వర్ ని కోరారు.

చందన నాగేశ్వర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో చేనేతల కష్టాలను చూసి.. వారికి అండగా ఉండేందుకు నేతన్న నేస్తానికి శ్రీకారం చుట్టారని, చేనేత పరిశ్రమ ద్వారా ఉపాధి పొందేవారు ఎలా బ్రతకాలో అర్థంకాని పరిస్థితి ఉండేదని అందుకే వారికి కోసం ఈ పథకం తీసుకొచ్చామన్నారు. కేవలం మగ్గాలను నమ్ముకుని జీవిస్తున్న వారికి ప్రభుత్వం ఏడాదికి నేతన్న నేస్తం పథకం ద్వారా రూ.24,000 ఆర్థిక సాయం అందించి ముడి సరుకు, ఇతర అవసరాలకు ఉపయోగించుకునే విధంగా సాయపడుతోందని తెలియజేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ముప్పన వీర్రాజు, తెల్ల పరమేశ్వర రావు, బీరకా సత్యనారయణ తదితరులు పాల్గొన్నారు....