వీధి కుక్క స్వైరవిహారం, ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందించిన అధికారులు

వీధి కుక్క స్వైరవిహారం, ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందించిన అధికారులు

రెండు సంవత్సరాల బాలుడిని తీవ్రంగా గాయపరిచిన వీధి కుక్క

పెరవల్లి మండలం, వెంకట్రాయపురం గ్రామంలో దారుణం


ఏపీ పబ్లిక్ న్యూస్ : వెంకట్రాయపురం

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం వెంకట్రాయపురంలో దారుణం జరిగింది. బొక్కా సుబ్రహ్మణ్యం కుమారుడు రెండు సంవత్సరాలు బాబు (సాయి) ది.20/12/2022 సాయంత్రం 5గంటలకు ఆరుబయట వాకిట్లో ఆడుతూ ఉండగా వీధి కుక్క బాబును, నుదుటన తీవ్రంగా కరవగా బాలుడు స్పృహ కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే బాబును ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యుల సలహా మేరకు హుటాహుటిన రాజమహేంద్రవరంలో ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అత్యవసర విభాగంలో వైద్యులు సుమారు గంట కష్టపడి ఆపరేషన్ చేశారు. లక్ష రూపాయలు ఖర్చు అయిందని, ప్రస్తుతం బాలుడు పరిస్థితి నిలకడగా ఉందని, బాలుడి కంటిరెప్పపై నుండి నుదుటన లోతుగా కుక్క గాయపరిచిందని ఇది చాలా దారుణమని, గత కొన్ని నెలలుగా గ్రామపంచాయతీ వారికి వీధి కుక్కల బెడద పరిష్కరించమని ఎన్నిసార్లు చెబుతున్నా పట్టించుకోలేదని, తక్షణమే అధికారులు స్పందించి కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారని గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నామను బాలు మీడియాకు తెలిపారు.