పేదల సంక్షేమమే జగనన్న సంకల్పం - ఎంపీ భరత్

పేదల సంక్షేమమే జగనన్న సంకల్పం

జనరంజక పాలనలో తండ్రికి మించిన తనయుడు 

సీఎం జగన్ జన్మదిన వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎంపీ భరత్

ఏపీ పబ్లిక్ న్యూస్, రాజమండ్రి: 

పేదల ఆర్థిక చైతన్యం, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషిచేస్తున్నారని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. సోమవారం ఉదయం నగరంలోని బెస్ట్ ప్రైస్ సమీపంలోని లఫ్లోరా అపార్ట్మెంట్ వద్ద జగనన్న పుట్టిన రోజు వేడుకలను పార్టీ శ్రేణులతో కలిసి అత్యంత ఘనంగా ఎంపీ భరత్ ప్రారంభించారు. తొలుత దివంగత వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.‌ అనంతరం జగన్ జన్మదినోత్సవాలను పురస్కరించుకుని మామిడి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ తండ్రికి మించిన తనయుడిగా ప్రజారంజక పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు జగనన్న పొందారన్నారు.‌ ఈ నెల 21న సీఎం జగన్ 50 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా దేవుని ఆశీస్సులు, ఆయురారోగ్యాలు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నానని అన్నారు. గడిచిన మూడున్నర సంవత్సరాల పాలన అద్భుతమని, నిరుపేదలను అన్ని రకాలుగా పైకి తీసుకువచ్చేందుకు జగనన్న చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ స్వాగతించారన్నారు. ప్రజా సంక్షేమానికి వైఎస్సార్ ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడు జగన్ మూడు అడుగులు ముందుకువేసి ప్రజల మనసులు దోచుకున్నారన్నారు. పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలన్నదే జగన్ ప్రధాన‌ ఆశయం, సంకల్పమని అన్నారు. ‌రానున్న 2023 జనవరి నుండి పెన్షన్ పెంచుతున్నారని, అది కూడా రాజమండ్రి నుండే శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, జగన్మోహన్ రెడ్డి మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధితో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్ళేలా ఆ దేవుని కరుణా కటాక్షాలు జగన్మోహన్ రెడ్డి పై ఉండాలని ఎంపీ భరత్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర శాఖ అధ్యక్షుడు అడపా శ్రీహరి, వైసీపీ నేతలు మజ్జి అప్పారావు, అన్నపూర్ణ రాజు, కొమ్మోజు దుర్గారావు, దుంగా మంగ, దుంగా సురేష్, ఉల్లూరి రాజు, కడియాల లక్ష్మణరావు, గుర్రం గౌతమ్, మార్గాని బుజ్జి తదితరులు పాల్గొన్నారు.