ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది 

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చందన నాగేశ్వర్


ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామంలో సచివాలయం-1 పరిధిలో 2వ రోజు జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ గ్రామంలో "గడప - గడపకు తిరిగి మన ప్రభుత్వం" అందిస్తున్న సంక్షేమ పథకాలను అధికారుల సమక్షంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడమే కాకుండా వారి అవసరాలను గుర్తించడమే లక్ష్యంగా ఈకార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గడపగడపకూ తిరుగుతూ. వృద్ధులు, అక్కాచెల్లెమ్మలు, యువతతో మాట్లాడారు. అన్నా రైతు భరోసా సాయం అందిందా అవ్వా, తాత పింఛన్‌ వస్తోందా ఆరోగ్యం బాగుందా అక్కా, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి డబ్బులు పడ్డాయా అంటూ అప్యాయంగా పలకరించారు. ప్రజలను సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటిలోనూ నవరత్నాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ప్రజలు చందన నాగేశ్వర్ దృష్టికి తీసుకువచ్చారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఇప్పుడు జగనన్న ప్రభుత్వానికి తేడా వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి కులం, మతం, పార్టీలకు  అతీతంగా పథకాలు అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ  నాయకులు కార్యకర్తలు, వాలంటీర్స్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.