రైతు పండించిన పంటకు భరోసా ఇవ్వండి: సారవకోట మండలం టిడిపి అధ్యక్షులు కత్తి'రి

రైతు పండించిన పంటకు భరోసా ఇవ్వండి: సారవకోట మండలం టిడిపి అధ్యక్షులు కత్తి'రి 


ఏపీ పబ్లిక్ న్యూస్, సారవకోట : మండలం లో ఉండే రైతాంగానికి భరోసా ఇచ్చేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుందని, అయితే ఈ ప్రక్రియను ఆన్లైన్ లో నిర్వహిస్తున్న తరుణంలో రైతాంగానికి జరుగుతున్న కష్ట నష్టాలను పరిశీలించాలని పత్రిక ప్రకటన ద్వారా సారవకోట మండలం టిడిపి అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మండలం లో ఏయే ప్రాంతాలకు చెందిన వారు అదే ప్రాంతానికి సమీపంలో ఉన్న మిల్లుల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా రైతాంగానికి ప్రయోజనం చేకూరందని, 8 కిలోమీటర్లు దాటితే క్వింటాకు రూ.28 ప్రభుత్వం ఇస్తుందని, అంతకుమంది దూరమైన పక్షంలో ప్రభుత్వానికి ఆర్థికభారమవుతుందని, మరోవైపు రైతుకు కూడా దూరాభారం అవుతుందన్నారు. జిల్లాలో సారవకోట మండల రైతులు నరసన్నపేట, కోటబొమ్మాళి మండలకు, హిరమండలం మండలం రైతు ధాన్యం సారవకోట మిల్లుకు కు, ఎల్.ఎన్.పేట మండలానికి చెందిన రైతు శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి గ్రామంలో మిల్లుకు, శ్రీకాకుళం రూరల్ మండలం గూడెం గ్రామానికి చెందిన రైతు సింగుపురం గ్రామానికి చెందిన మిల్లుకు, కల్లేపల్లి గ్రామానికి చెందిన రైతు సింగుపురం మిల్లుకు రావాల్సి వస్తోందని కత్తి'రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జిల్లాలో ఎన్నో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రంలో మూడు నెలలకు తాత్కాలిక ప్రాతిపదికన ఐదుగురిని ప్రభుత్వం విధి నిర్వహణకు వినియోగిస్తుందని, అందులో భాగంగా ముగ్గురు వలంటీర్లు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటరు, ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఈ విధులు నిర్వహిస్తూ కాటా వేసి పంపిస్తున్నారన్నారు. రైతు భరోసా కేంద్రంలో ఈ ఉద్యోగులు పరిశీలించిన మీదట తదుపరి ఈ ధాన్యం మిల్లుకు వెళ్లిన పక్షంలో మిల్లర్లు ధాన్యంలో తేమ ఎక్కువ ఉందని, దీనివల్ల రైతాంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.రైతులు, మిల్లర్ల మధ్య ఆందోళనకరమైన వాతావరణం ఉదని, జిల్లాలో ధాన్యం నాణ్యతా ప్రమాణాలు తెలుసుకొనే పరీక్ష చేయాలంటే దీనికి అవసరమైన పరికరాలు ఉండాలన్నారు. మాయిశ్చరైజర్ మిషన్ తప్ప ఎటువంటి పరికరాలు అందుబాటులో లేవని, దీనితో రైతాంగానికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైతు పండించిన పంటకు సమీపంలో ఉండే మిల్లర్లకు ఇచ్చేందుకు, రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలని కత్తిరి కోరారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతాంగం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న పక్షంలో రైతులు పండించిన ధాన్యం ఈ క్రాప్ బుకింగ్ అయితేనే కొంటున్నారని, జిల్లాలో 60 నుంచి 70 శాతం కౌలు రైతులు వరి పండిస్తున్నారని, కౌలు రైతులు ధాన్యం కొనుగోలుకు అనేక సాంకేతిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వ యంత్రంగం గుర్తించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో తేమశాతం పరీక్షలు చేసి నిర్దేశిత ప్రమాణాలతో మిల్లులకు పంపినా మిల్లులో మళ్లి తేమ పరీక్షలు చేసి తేమ ఎక్కువగా ఉందని, ప్రతి బస్తాకు 4 నుంచి 6 కిలోలు ధాన్యం కొట్టేస్తున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు, రైతు భరోసా కేంద్రాల్లో చేసిన తేమ పరీక్షలు మిల్లులో ఉన్న తేమ పరీక్షలకు తేడా ఎందుకు వస్తుందన్నారు. సంప్రదాయ పద్ధతిలోనే రైతాంగం ధాన్యం ఎగురబోత చేస్తున్నారని, కొంత ధాన్యంలో తేడా ఉన్నంత మాత్రాన మిల్లర్ల నుంచి 6 కిలోలకు బస్తాకు తగ్గించడం ఏమిటని ఆయన పేర్కొన్నారు. బియ్యం దిగుమతి విషయంలో మిల్లర్లు చెప్పేందే వేదంగా భావిస్తున్నారని, రైతుకు, మిల్లర్కు ఉన్న గందరగోళం తొలగించాలంటూ రైతును మిల్లు వద్దకు అనుమతించాలన్నారు. ఒకే ప్రాంతంలో ఉన్న రైతులు తమ దగ్గర ప్రాంతంలో ఉన్న మిల్లులకు కాకుండా సుదూర ప్రాంతాల మిల్లులకు ధాన్యం పంపడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. పౌరసరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయశాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల రైతాంగానికి ఇబ్బంది ఎదురవుతుందని, రైతు ఖాతాల్లో డబ్బులు వేసే సమయంలోనే సమస్యలు వస్తున్నాయన్నార. రైతులకు పండగకు డబ్బులు పడతాయాని నమ్మకం లేక ఇదేమి ఖర్మరా రాష్ట్రానికి అని ప్రతి గ్రామంలొ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సారవకోట మండలం టిడిపి అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ అన్నారు.