ప్రజా సమస్యలు పరిష్కరించడమే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం : చందన నాగేశ్వర్

ప్రజా సమస్యలు పరిష్కరించడమే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం - చందన నాగేశ్వర్ 




ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా

ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం బొమ్మురు గ్రామంలో సచివాలయం -1 పరిధిలో గురువారం నాడు జరిగిన 4వ రోజు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల అందిస్తూ సరికొత్త అధ్యాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన రెడ్డి నాంది పలికారని రాజమండ్రి రూరల్ కోఆర్డనేటర్ చందన నాగేశ్వర్ పేర్కొన్నారు. 4వ రోజు నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాత పేట, మస్జిద్ వీధి, రామాలయం వీధులు ప్రాంతంలో తిరుగుతూ సంబంధిత అధికారులు, సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు తదితరులతో చందన నాగేశ్వర్ కలిసి మూడున్నర ఏళ్లలో అందిన సంక్షేమ పథకాలు వివరాలను చేకూరిన లబ్దిని 410 కుటుంబాలకి వివరిస్తూ బుక్ లెట్లును అందజేశారు. రాష్ట్రంలోజగన్మోహన రెడ్డి గారు మూడున్నర ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని అందుకు గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్న స్పందనే నిదర్శనమన్నారు. దేశంలోనే తలుపు తట్టి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఇతర రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నీ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నాయన్నారు. స్ధానికులు చందన నాగేశ్వర్ కి స్ధానికంగా నెలకొన్న డ్రైనేజీ, రోడ్లు సమస్యలను వివరించారు, చందన నాగేశ్వర్ స్పందిస్తూ ప్రాధాన్యత పరంగా నివేదికలు రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, బొమ్మూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యనమల త్యాగరాజు,తోడెటి రాజ, ముద్దలా అను, సోమన శ్రీను, కే.వి సుబ్బారెడ్డి, మేడపాటి రామారెడ్డి, కాకులపటి కుమార్,తోడేటి రాహూల్, ఏ.శ్రీనివాస్, బి. సుధీర్ కుమార్,గులిమి నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు...