క్రీస్తు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం - నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు

క్రీస్తు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం - యూత్ క్రిస్మస్ వేడుకలలో నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు 




ఏపీ పబ్లిక్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా 

నిడదవోలు పట్టణం కృపాదార లూథరన్ చర్చ్ నందు జరిగిన యూత్ క్రిస్మస్‌ సంబరాల్లో ఎమ్మెల్యే జి. శ్రీనివాస్‌ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై యూత్ క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేశారు.

ఎమ్మెల్యే జి. శ్రీనివాస్‌ నాయుడు మాట్లాడుతూ క్రీస్తు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, బైబిల్‌లోని క్రీస్తు బోధనల ద్వారా ప్రతి ఒక్కరూ సేవ చేయాలన్నారు. ఇతరుల పట్ల ప్రేమ, శాంతి, దయ, కరుణ చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ కౌన్సిలర్స్, పట్టణ వైఎస్సార్‌సీపీ నాయకులు, లూథరన్ చర్చ్ సభ్యులు పాల్గొన్నారు.