కొవ్వూరు జట్టు స్టేట్ లెవల్ మ్యాచ్ లకు క్వాలిఫై అవ్వడం మనకు గర్వ కారణం - హోమ్ మంత్రి తానేటి వనిత

కొవ్వూరు జట్టు స్టేట్ లెవల్ మ్యాచ్ లకు క్వాలిఫై అవ్వడం మనకు గర్వ కారణం - హోమ్ మంత్రి తానేటి వనిత


ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా

ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ 

కొవ్వూరు : జగనన్న క్రీడా సంబరాలు లో భాగంగా కొవ్వూరు క్రికెట్ జట్టు ప్రతిభ కనబరచి జోనల్ లెవల్ లో విజేతగా నిలవడం అభినందనీయమని రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత అన్నారు. ఈ సందర్బంగా హోమ్ మంత్రి తానేటి వనిత జట్టును అభినందనలు తెలిపి మాట్లాడుతూ జగనన్న క్రీడా సంబరాలు లో భాగంగా కొవ్వూరు జట్టు శుక్రవారం కాకినాడలో జరిగిన జోనల్ లెవల్ లో విజేతగా నిలిచి స్టేట్ లెవల్ మ్యాచ్ లకు క్వాలిఫై అవ్వడం మనకు గర్వ కారణం అన్నారు. ఆదివారం నుండి విజయవాడలో జరిగే స్టేట్ వైడ్ మ్యాచ్ ల కొరకు టీం కెప్టెన్ గుబతాల సురేష్ ఆధ్వర్యంలో జట్టు సభ్యులు అందరూ మంచి ప్రతిభను కనబరుస్తూన్నారన్నారు. కాకినాడలో జరిగిన జోనల్ ప్రెజేంటేషన్ కార్యక్రమంలో మన కొవ్వూరు పేరును జగనన్న దృష్టిలో కొవ్వూ రు పట్టణానికి మంచి పేరు తెచ్చిన క్రీడాకారుల టీం సభ్యు లందరిని అధికారులు అందరూ మనస్పూర్తిగా అభినందిస్తూన్నారన్నారు. ఈ నెల 20 వ తే దీన జరిగే మ్యాచ్ లో గెలుపు పొంది మంచి క్రీడా స్ఫూర్తి కన బరచాలని క్రీడాకారులు అందరికీ హోమ్ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.