నిడదవోలులో క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఛైర్మన్ అధ్వర్యంలో భారీ ర్యాలీ

నిడదవోలులో క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఛైర్మన్ అధ్వర్యంలో భారీ ర్యాలీ

జగనన్న స్వచ్ఛ సంకల్పం - క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం

నిడదవోలులో మున్సిపల్ ఛైర్మన్ అధ్వర్యంలో భారీ ర్యాలీ


ఏపీ పబ్లిక్ న్యూస్, నిడదవోలు:-

జగనన్న స్వచ్ఛ సంకల్పం - క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా నిడదవోలు పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలిలో సాధిద్దాం సాధిద్దాం స్వచ్ఛ నిడదవోలును సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. అలాగే పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్తపై పట్టణ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ నిడదవోలు పట్టణమును క్లీన్ నిడదవోలుగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. మున్సిపల్ పరిధిలో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. పట్టణ మున్సిపల్ కమిషనర్ కేవీ పద్మావతి మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం - క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నిడదవోలులో ఈ నెల 12 నుంచి తడి, పొడి చెత్త గురించి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేవీ పద్మావతి, కౌన్సిలర్లు గోపిరెడ్డి శ్రీనివాస్, కామిశెట్టి సత్యనారాయణ, కొత్తపల్లి సుప్రియ, మునిసిపల్ అధికారులు, సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు