ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే మోసగాళ్లు, కుట్రదారుల చేతిలో మోసపోవద్దు

ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే మోసగాళ్లు, కుట్రదారుల చేతిలో మోసపోవద్దు

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకట జ్యోతిర్మయి

ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

రాజమహేంద్రవరం : హైకోర్టుతో పాటు దిగువ కోర్టులలో భారీగా పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసిన నేపధ్యములో, మోసగాళ్లకు, వారి బారిన పడుతున్న అభ్యర్థులకు హైకోర్టు గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసిందని ప్రిన్సిపల్ జిల్లా కోర్టు, రాజమహేంద్రవరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఒక ప్రకటన లో తెలియజేసారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే మోసగాళ్లు, కుట్రదారుల చేతిలో మోసపోవద్దని, న్యాయమూర్తులు, అధికారుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తులు, వారికి సహకరించేవారి పైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించడం జరిగిందన్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించే ఏ వ్యక్తినీ కూడా విడిచిపెట్టే సమస్యే లేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు హైకోర్టు వెబ్ సైటు ను మాత్రమే అనుసరించాలని సూచించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపు మాటలు చెప్పే వ్యక్తులు, నకిలీ నియామక పత్రాలు ఇచ్చేవారు తారసపడితే వారి గురించి హైకోర్టుకు ఫిర్యాదు చెయ్యాలని ప్రిన్సిపల్ జిల్లా కోర్టు, రాజమహేంద్రవరం వారు ఆ ప్రకటనలో తెలిపారు.