దళిత మహిలతో "భూపోరాట సాధన కమిటీ" ఏర్పాటు

దళిత మహిలతో "భూపోరాట సాధన కమిటీ" ఏర్పాటు

ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

పోతినీడుపాలెం (అనుమునిలంక) గ్రామంలో ప్రభుత్వానికి చెందిన కొండపోరంబోకు 200ఎకరాలు గ్రామంలో అగ్రకుల భూస్వాములు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. దళితులకు సెంటు భూమికూడా లేకుండా జీవిస్తున్నారు. పేద దళిత కుటుంబాలకు భూమి పంచాలని దళిత మహిళలు పోరాటానికి సిద్ధపడ్డారు. గ్రామంలో దళిత మహిళలుతో సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో "భూపోరాట సాధన కమిటీ" ఏర్పాటు చేశారు. కన్వీనర్ గా సౌతులూరి మరియమ్మ, చేబత్తుల వెంకట నర్సమ్మ, చెరుకుతోట అచ్చమ్మ, మంగమూరి అగ్నిస్, నంబూరి నాగమణి, కొసనం వరలక్ష్మి, నూతులపాటి రమణ, తప్పిట్ల రామ సీత, గంట రాజ్యం, కొవ్వూరి శేషమ్మ, తప్పెట్ల జగదీశ్వరి ఎన్నిక అయ్యారు.