ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పేపర్ మిల్ యాజమాన్యం దిగి రావాలి - జక్కంపూడి రాజా

ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పేపర్ మిల్ యాజమాన్యం దిగి రావాలి - జక్కంపూడి రాజా





ఏపీ పబ్లిక్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా

ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

రాజమహేంద్రవరం : కోట్ల రూపాయలు లాభాల ఆర్థిస్తున్న పేపర్ మిల్ యాజమాన్యానికి ప్రజా ఆరోగ్యం పట్టదా?

గోదావరి నదిలో పేపర్ మిల్ రసాయనాలు వ్యర్ధాలు కాలుష్యంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తాం ....

గోదావరి నది పరిరక్షణకు టి.కె విశ్వేశ్వర రెడ్డి చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలియజేసిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా...

ప్రజల ఆరోగ్యం కోసం టి.కే విశ్వేశ్వర రెడ్డి చేపట్టిన ఉద్యమం ప్రశంసనీయమని తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు

గురువారం నాడు రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద గత 31 రోజులుగా రాజమహేంద్రవరం నగర ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలు అందజేయాలని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టికె.విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ పవిత్ర గోదావరి నదిలో పేపర్ మిల్లు ఇతర పరిశ్రమలకు చెందిన రసాయనాలు,వ్యర్ధాలు కలవడం వలన నదీ జలాలు కలుషితమై ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ రసాయనాలు వలన నదిలోని జీవరాసులు పై ప్రభావం పడుతుందన్నారు. 

పేపర్ మిల్ నుంచి వెలువడే రసాయనాలు,వ్యర్ధాలు వలన నదీ జలాలు కలుషితం కావడం వలన ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.పేపర్ మిల్లు వ్యర్ధాలపై అవగాహన ఉన్న టీ కే విశ్వేశ్వర రెడ్డి ప్రజల సమస్యలను తన భుజస్కందాలపై వేసుకొని,గోదావరి నదిలో రసాయనాలు, వ్యర్ధాలు కలవకుండా నది దిగు భాగాన కలపాలని ఆందోళన చేస్తున్నారన్నారు.ఉద్యమాలలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనలేక పోయినప్పటికీ పేపర్ మిల్ వ్యర్ధాలు కలవడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

ఇప్పటికైనా పేపర్ మిల్ యాజమాన్యం ప్రజల ఆరోగ్య దృష్ట్యా పేపర్ మిల్ రసాయనాలు వ్యర్ధాలు గోదావరి నదిలో కలపకుండా ధవళేశ్వరం ఆనకట్ట దిగువ భాగంలో కలపాలని సూచించారు.

రానున్న రోజులలో ప్రజల సహకారంతో ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చుతుందని,టికే విశ్వేశ్వర రెడ్డికి అన్ని విధాలుగా తోడ్పాటు అందజేస్తామని,ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి,పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.