నిడదవోలులో ఎమ్మెల్సీ అనంత బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి దళిత సంఘాల JAC

నిడదవోలులో ఎమ్మెల్సీ అనంత బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి దళిత సంఘాల JAC

ఏపీ పబ్లిక్ న్యూస్, నిడదవోలు:-

దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి దళిత సంఘాల JAC తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిడదవోలు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చౌక్ వద్ద దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అనంత బాబు బెయిల్ రద్దు చేసి నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అనంత బాబు దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా JAC కన్వీనర్ KVPS రాష్ట్ర కమిటీ సభ్యులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ అనంత బాబు దగ్గర డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసి తనే హత్య చేశాను అని ఒప్పుకున్నాక 7నెలలు తర్వాత బెయిల్ పై రాజమండ్రి సెంట్రల్ జైల్ నుండి కాన్వాయ్ తో బయటకు రావటం వైసీపీ శ్రేణులు స్వాగతం చెప్పటం చూస్తే ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ముద్దాయికి బెయిల్ రావటానికి సహకరించినట్లు తెలుస్తుందని రాంబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం దళితుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. వెంటనే బెయిల్ రద్దు చేసి తిరిగి జైల్ కి వెళ్లేలా ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి చిత్తశుద్ది నిరూపించుకోవాలన్నారు. knps నాయకులు గెడ్డం రవీంద్ర బాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ గా అనంత బాబుతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. దళిత ప్రజా వేదిక నాయకులు చోళ్ళ రాజు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వెంటనే బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహాసేన నాయకులు ప్రకాష్, BSP నాయకులు అంబటి పుల్లారావు, రైతు సంఘం నాయకులు నల్లా నాగరాజు, రిపబ్లిక్ పార్టీ నాయకులు పెనుమాక డేవిడ్ రాజు, టీ నానీ, మణి కుమార్, తదితరులు పాల్గొన్నారు