ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్ పై KVPS రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో దళిత యువకులు నిరసన

ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్ పై KVPS రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో దళిత యువకులు నిరసన 


ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

నిడదవోలు: దళిత యువకుడ్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కి బెయిల్ మంజూరు చెయ్యటాన్ని KVPS తూర్పు గోదావరి జిల్లా కమిటీ నిరసన వ్యక్తం చేసింది. ఈరోజు నిడదవోలు చర్చ్ పేటలో దళిత యువకులు నిరసన వ్యక్తం చేశారు KVPS రాష్ట్ర కమిటీ సభ్యులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ నిందితుడు అనంత బాబు కి కోర్టు షరతుల తో కూడిన బెయిల్ పై విడుదల అయిన నేరస్తుడికి అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు. ప్రజా ప్రతినిధులు ఎటువంటి అనుమతులు లేకపోయినా ర్యాలీగా ఊరేగించడం దారుణమని వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం అని రుజువు చేసుకుందని రాంబాబు విమర్శించారు రాబోయే కాలంలో రాష్ట్రంలో దళితులు ఎమ్మెల్సీ అనంత బాబు కి రాజకీయంగా స్థానం లేకుండా భూస్థాపితం చెయ్యటానికి సిద్ధంగా ఉన్నారని. రాంబాబు హెచ్చరించారు చిన్న చిన్న నేరాలు చేసిన లేదా ఇరికించిబడిన దళితులు బలహీన వర్గాలకు సంవత్స రాలు తరబడి బెయిల్ ఇవ్వకుండా జైల్లో మగ్గుతున్నారని నిందితుడ్ని కాపాడటానికి పోలీసులు చేతనైన సహాయం అందించారని ఆరోపించారు తక్షణమే బెయిల్ రద్దు చేసి నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు