మోర్త ZPHS పాఠశాల విద్యార్థులకు టాబ్లను అందజేసిన నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు

మోర్త ZPHS పాఠశాల విద్యార్థులకు టాబ్లను అందజేసిన నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు



ఏపీ పబ్లిక్ న్యూస్, ఉండ్రాజవరం మండలం : మోర్త ZPHS పాఠశాల నందు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచ్చితంగా సరఫరా చేస్తున్న టాబ్లను అందజేసిన నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజెన్లుగా తీర్చిదిద్దేలా, డిజిటల్ విధానంలో పాఠ్యoశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా... మెరుగైన చదువులు దిశగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతిలోకి అడుగుపెట్టిన పిమ్మట ప్రతి విద్యార్థికి ఇకపై ప్రతి ఏటా బైజూస్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్ లు పంపిణి చేస్త్తూ , ఆఫ్ లైన్లో కూడా పనిచేసే విదంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్దులు 2025 విద్యా సంవత్సరంలో CBSE విధానంలో ఇంగ్లిష్ మీడియంలో 10వ తరగతి పరీక్ష రాసేలా పిల్లలను సన్నద్ధం చేయడమే లక్ష్యoగా జగనన్న ప్రభుత్వం పని చేస్త్తుందన్నారు. నిడదవోలు నియజవర్గంలో మొత్తం 2245 ట్యాబ్లు మంజూరయ్యాన్నారు. మోర్త గ్రామంలో పాఠశాలలను నాడు నేడు పథకం రెండు దశల్లో కలిపి మొత్తం రూ.1,00,42,000/- రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. నిడదవోలు నియోజకవర్గం లో గత మూడున్నర సంవత్సర కాలంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు, పాటశాలలో మౌలిక వసతులు మెరుగు పరచడానికి జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, పాఠశాలలో నాడు నేడు, వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాల ద్వారా నిడదవోలు నియోజకవర్గంలో సుమారు రూ. 272.76 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు.  విద్యార్థులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు కి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే తో పాటు ఉండ్రాజవరం మండల ఎంపీపీ, మోర్త గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, మోర్త PACs చైర్మన్, వైఎస్ఆర్సీపీ గ్రామ నాయకులు కార్యకర్తలు, మండల విద్యాశాఖ అధికారి పాల్గొన్నారు.