గడ్డర్ ను తొలగించే వరకు ఉద్యమిస్తాం - దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ళ రాజు

గడ్డర్ ను తొలగించే వరకు ఉద్యమిస్తాం - దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ళ రాజు




ఏపీ పబ్లిక్ న్యూస్, కొవ్వూరు నియోజకవర్గం : సీతంపేట పంచాయతీ పరిధిలోగల, విజ్ఞేశ్వరం బ్యారేజీ సెంటర్లో ఇరిగేషన్ వారు వేసిన గడ్డర్ వలన స్కూలు పిల్లలు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. మద్దూర్ లంక గ్రామం నుండి హాస్పిటల్ కు అత్యవసరంగా నిడదవోలు హాస్పిటల్ కు గాని, కొవ్వూరు హాస్పిటల్ కు గాని, వెళ్లాలంటే అంబులెన్స్ వచ్చే మార్గం కూడా లేదని. గడ్డర్ వలన లంక ప్రజలు, పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని జై భీమ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ళ రాజు తెలియజేశారు. నాయకులు, స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విజ్జేశ్వరం గ్రామ ప్రజలు, మద్దూరు లంక గ్రామ ప్రజలు, యూత్ కమిటీ సభ్యులు, కలిసి బ్యారేజ్ వద్ద గురువారం నాడు గడ్డర్ ను వెంటనే తొలగించాలని, రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి గడ్డర్ తొలగించే వరకు ఉద్యమిస్తామని, లేనిపక్షంలో మేమే తొలగిస్తామని చోళ్ళ రాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజ్జేశ్వరం సర్పంచ్ తిక్క శ్రీను, మాజీ సర్పంచ్ పూటీ వెర్రిబాబు, కలవచర్ల సర్పంచ్ దళిత రక్షణ దళం కొడమంచిలి రమణ, జై భీమ్ దళిత ప్రజా వేదిక జిల్లా అధ్యక్షులు దిద్దే రాజు, మద్దూర్ లంక యూత్ కడిమి చిరంజీవి, తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.