సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందాలు జూధ క్రీడలపై నిషేధం - కలెక్టర్ డా. కే మాధవీలత

సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందాలు జూధ క్రీడలపై నిషేధం - కలెక్టర్ డా. కే మాధవీలత


ఏపీ పబ్లిక్ న్యూస్, రాజమండ్రి : సంక్రాంతి పండుగ సందర్భంగా జూద క్రీడలు, కోడిపందాలు పై నిషేధం ఉందని జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి 22 అంశాలతో కూడిన దిశా నిర్దేశం వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పంచాయతీ కార్యదర్శులు, విఆర్వో లు పొలాల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా కోడిపందాలు నిర్వహించడానికి అనుమతి లేదని ఈ విషయంలో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. ఇటువంటి క్రీడల నిర్వహణ నిషేదం విషయంలో కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అన్నారు. పోలీసులు, రెవెన్యూ సంబంధిత సమన్వయ శాఖ అధికారులు కోడిపందాల నిర్వాహకులపై దృష్టి సారించి, అటు వంటివి నిర్వహించ కుండా జరగకుండా విస్తృత దాడులు కేసు నమోదు చేయాలని కలెక్టర్ మాధవీలత సూచించారు. జిల్లావ్యాప్తంగా కోడిపందాలు జూధాలు అనధికార మద్యం విక్రయాల పై జిల్లా, డివిజన్ , మండలాల్లోని సమన్వయ కమిటీలు విస్తృతస్థాయి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా జిల్లాలో కోడిపందాలు, జూదాలు, అటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కోడి పందాలు నిర్వహించే, పాల్గొనే వారిపై జంతు హింస చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. కోడిపందాలకు జూద క్రీడలకు స్థలాలు ఇచ్చే భూ యజమానులపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుము వసూలు చేయడం జరుగుతుందన్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో చిత్రీకరించి ఆధారాలను సేకరించి సంబంధిత సమన్వయ అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇటువంటి ఘటనలకు పాల్పడిన లేదా ప్రోత్సహించిన వారిపై 144 పిసి , తదితర అనుబంధ కేసులు నమోదు చేయాలని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న మార్గదర్శకాలకు లోబడి వివిధ సెక్షన్ల ప్రకారం క్రీడా చట్టం 1974 మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ మాధవీలత సూచించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా కల్తీ మద్యం విక్రయాలను నిరోధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు వీఆర్వోలు, సమన్వయంతో పని చేయాలన్నారు. జనవరి 7వ తేదీ నుంచి 25 వరకు ఈ అంశాలపై సమన్వయ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి జనవరి 25 తదుపరి నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు.