మణిపూర్ లో విధ్వంసకారులను అరెస్టు చేయాలి - ప్రజా సంఘాల డిమాండ్

మణిపూర్ లో విధ్వంసకారులను అరెస్టు చేయాలి - ప్రజా సంఘాల డిమాండ్ 

    మణిపూర్ లో ఆదివాసులపై జరుగుతున్న మారణకాండపై మౌనం వీడుదాం. 

    మణిపూర్ లో విధ్వంసకారులను అరెస్టు చేయాలని డబుల్ ఇంజన్ సర్కార్ ను డిమాండ్ చేద్దాం. కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి ముప్పిడి కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

   రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణకు సలహాలు ఇవ్వండి.    

ఏపీ పబ్లిక్ న్యూస్ : 

   ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రధాన కార్యదర్శి గెడ్డం రవీంద్రబాబు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్ర జనాభా 32 లక్షలు. వారిలో 53% ఓబిసి కి చెందిన 'మెయితీ'లు వీరు మెజారిటీ హిందువులు. పురోహితులు కూడా ఉన్నారు. 40% నాగా, కుకి తెగలకు చెందిన ఆదివాసులు. ఆదివాసుల్లో మెజారిటీ క్రైస్తవులు. అత్యల్పంగా హిందువులు కూడా ఉన్నారు. మిగిలిన 10% ప్రజలు ముస్లింలు, ఇతర తెగల వాళ్ళు. 80 శాతం భూమి అడవులు, నీటి కొలనులతో ఉంటుంది. అక్కడ ఆదివాసీలు నివసిస్తున్నారు. మిగిలిన ప్రాంతంలో మెయితి లు జీవిస్తున్నారు. 16 జిల్లాలతో ఉన్న మణిపూర్ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 40 మంది మెయితీ లు. ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ మెయితి తెగకు చెందినవాడు. 10 మంది నాగా, 10మంది కుకి తెగలకు చెందినవారు ఉన్నారు. 1950 కి పూర్వం మెయితి లు ఎస్టి జాబితాలో ఉన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి ఓబీసీ జాబితాలో కొనసాగుతున్నారు .గత కొన్నేళ్లుగా మెయితీలు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ లో మణిపూర్ హైకోర్టు మెయితీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేస్తూ, నాలుగు వారాల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‌

మతం పేరుతో మారణ హోమం          

   హైకోర్టు నిర్ణయాన్ని నిరసిస్తూ మే మూడవ తేదీన 'ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్' రాజధాని ఇంఫాల్ లో శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేశారు. ర్యాలీ అనంతరం మెయితీలు ఇంఫాల్ లోని నాగా, కుకీల ఇళ్లమీద చర్చిల మీద దాడులు చేశారు. 125 చర్చిలను తగలబెట్టారు. 2,500ఇళ్లు ధ్వంసం చేశారు. అనేకమంది నాగా,కుకి ఆదివాసి మహిళలను సామూహిక అత్యాచారం చేశారు. హత్యలు చేశారు. నగ్నంగా రోడ్ల వెంట పరిగెత్తిస్తూ కొట్టారు. పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి 3500 తుపాకులు, ఐదు లక్షల తూటలు ఎత్తుకెళ్లారని డీజీపీ కార్యాలయం ప్రకటించింది .50,000 మందికి పైగా ఆదివాసీలు నిరాశ్రయులయ్యారు. అంతకు రెట్టింపు ఇతర ప్రాంతాలకు పారిపోయారు. అనివార్య పరిస్థితుల్లో ఆదివాసులు ప్రతిఘటన దాడులకు పూనుకున్నారు. మే 28వ తేదీన మణిపూర్ ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కుకి మిలిటెంట్లు ఉగ్రవాదులని ప్రకటించారు .అదే రోజు భద్రత దళాలు 40 మంది ఆదివాసుల్ని కాల్చి చంపాయి. 25 రోజుల తర్వాత మణిపూర్ ని సందర్శించిన అమిత్ షా మణిపూర్లో సైన్యాన్ని దింపి శాంతిని నెలకొల్పుతానన్నారు. కానీ హైకోర్టు పెట్టిన చిచ్చు కి సర్కార్ ఆజ్యం పోస్తున్న కారణంగా మణిపూర్ మండుతూనే ఉంది. వైద్యం అందక ఆందోళనకారుల దాడుల్లో, భద్రతా దళాల కాల్పుల్లో గాయపడిన వారు, పిల్లలు, వృద్దులు, గర్భిణీ స్త్రీలు వందల సంఖ్యలో మరణిస్తున్నారు. ఇవన్నీ వివిధ ప్రసార సాధనాలలో,సోషల్ మీడియాలో వచ్చిన వార్తా కథనాలు. మణిపూర్ ఇప్పుడు ఒక నిషిద్ధ ప్రాంతం. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన రాహుల్ గాంధీని అడ్డుకున్నారు. సిపిఐ, సిపిఎం కు చెందిన నిజ నిర్ధారణ బృందాన్ని అడ్డుకొని కేసులు పెట్టారు. ఆదివాసులపై అత్యాచార హత్యలు జరుగుతుంటే ఆదివాసీ మహిళా రాష్ట్రపతి కనీసం స్పందించ లేదు. ఆదివాసి మహిళను రాష్ట్రపతిని చేశానని జబ్బలు చరుసుకుంటున్న 56 అంగుళాల ఛాతి ఇంతవరకు పెదవి విప్పలేదు. నేషనల్ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ ఏ ఒక్కటి కూడా మణిపూర్లో ఆదివాసులపై జరుగుతున్న మారణ హోమాన్ని ఖండించలేదు. దేశం మౌనంగా చోద్యం చూస్తుంది.

    మణిపూర్ లో జరుగుతుంది హిందువులకు, క్రైస్తవులకు మధ్య ఘర్షణ లనుకుంటున్నారా! ఆదివాసీలు, ఆదివాసే తరుల రిజర్వేషన్ల గొడవను కుంటున్నారా? లేదా ఎక్కడో సరిహద్దులో ఉన్న మణిపూర్ అల్లర్ల గురించి మనకెందుకులే అనుకుంటున్నారో తెలియదు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా కీర్తించబడుతున్న మన దేశంలో ఆదివాసి హననం జరుగుతుంది. అందుకే మనం మౌనం వీడుదాం. దేశాన్ని మణిపూర్ కాకుండా కాపాడుకుందాం. 

    కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అగ్రకులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది .8 లక్షల కన్నా తక్కువ వార్షికాదాయం ఉన్న వారిని అగ్రకులాల్లోని పేదలుగా గుర్తించింది. కేవలం ఐదు శాతం మాత్రమే ఉన్న అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు స్వాగతించాయి. 

     పెట్టుబడిదారీ వర్గాల ముద్దుబిడ్డలైన పాలకులు పేదలని నిరుపేదల స్థాయికి తొక్కేస్తూ, ధనికుల్ని అత్యంత సంపన్నులుగా అభివృద్ధి చేస్తూ సామ్రాజ్యవాదుల మార్కెట్ విస్తరణకు ఉపయోగపడుతున్నారు. ఈ ఆర్థిక దోపిడీ విధానాల నుండి దృష్టి మళ్లించడానికి పేద ప్రజల మధ్య కుల ,మత ,ప్రాంత,భాషా భేదాలు రెచ్చగొడుతూ మెజారిటీ ఓటు బ్యాంకుని కొల్లగొట్టి అధికారం దక్కించుకుంటున్నారు. కావున మణిపూర్ సమస్య కేవలం ఆదివాసీ క్రైస్తవుల సమస్య మాత్రమే కాదు. ఈ దేశ ఖనిజ సంపదను ,సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను, చేనేత ,వ్యవసాయ రంగాల్ని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడం ద్వారా జీవనోపాధిని ,బతుకు దెరువును కోల్పోయిన ప్రజలందరి సమస్య. వృత్తులు కోల్పోతున్న ఉత్పత్తి కులాల ప్రజల సమస్య .మొత్తంగా ఆర్ఎస్ఎస్ మతరాజకీయాల్లో పావులుగా మారుతున్న హిందువులలోని పేదలందరి సమస్య. కావున బిజెపి డైవర్షన్ పాలిటిక్స్ ను అర్థం చేసుకొని దేశాన్ని మణిపూర్ కాకుండా కాపాడుకుందాం. మణిపూర్ లోఅల్లరి మూకల్ని అరెస్టు చేసిశాంతి నెలకొల్పాలని బిజెపిని డిమాండ్ చేద్దాం. అందులో భాగంగా కుల నిర్మూలనా పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరై భవిష్యత్ కార్యాచరణకు మీ అమూల్యమైన సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో యూ వెంకట్రావు కె రాజు గోపి పండు రాజు సతీష్ గోతియ్య నల్లమ్మ సువార్త వెంకటలక్ష్మి కవల్లమ్మ సత్యవతి గంగా రత్నం తదితరులు పాల్గొన్నారు.