టిడ్కో ఇళ్లను పూర్తి చేయకపోవడం రాజకీయ కక్ష? ప్రజల పై కక్ష?

టిడ్కో ఇళ్లను పూర్తి చేయకపోవడం రాజకీయ కక్ష? ప్రజల పై కక్ష?




ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తీరుగూడెంవద్ద పేదలు బడుగు బలహీనవర్గాలు కోసం నిర్మించిన టిడ్కో భవనాలను జిల్లా కలెక్టర్ మాధవీలత, శాసన సభ్యులు శ్రీనివాస నాయుడు జిల్లా హౌసింగ్ అధికారులు ఎందుకు? పరిశీలించలేదని సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు ప్రశ్నించారు. నిన్న కలెక్టర్ ఎమ్మెల్యే తీరుగూడెంలో నిర్మిస్తున్న జగనన్న ఇళ్ళును పరిశీలించి ప్రక్కనే వున్నా టిడ్కో ఇళ్లను పరిశీలించక పోవటాన్ని సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈమేరకు ఒక ప్రకటన పత్రికలకు విడుదల చేశారు. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు నిర్మాణం జరిగి 5సంవత్సరాలు అయ్యింది సుమారు 1200వందల మంది పేద కుటుంబాల లబ్ధిదారులు లక్షలాది రూపాయలు ప్రభుత్వానికి అప్పులు చేసి డిపాజిట్ చేశారు. తీరుగూడెంలో నిర్మాణం పూర్తి చేసిన కేవలం రాజకీయ కక్ష ప్రజల పై కక్ష సాధింపు చర్యలు తప్ప మరొకటి కాదని రాంబాబు విమర్శించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అది ప్రజల సొమ్ముతో నిర్మించినవే జగన్, చంద్రబాబు సొంత సొమ్ములు కావు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫోటోతో వున్న స్కూల్ బ్యాగ్ సుమారు 3వందల కోట్లు విలువ చేసే వాటిని జయలలిత ఫోటో వున్నా విద్యార్థులకు పంపిణీ చేశారు. స్టాలిన్ ఆ సందర్భంగా స్టాలిన్ ఇది ప్రజల సొమ్ము రాజకీయ కారణాలతో దుర్వినియోగం కాకూడదు అని వ్యాఖ్యానించారు. కానీ ఇక్కడ రాజకీయ పగతో పేద ప్రజల పై వైసీపీ ప్రభుత్వం పగ తీర్చుకోవడానికి వెనుకాడటం లేదు. జగనన్న ఇళ్లు నిర్మాణం త్వరిత గతిన పూర్తి చెయ్యాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్న ఎమ్మెల్యే టిడ్కో ఇళ్లు ప్రజలకు అందించాలని ఎందుకు ఆతృత చూపటం లేదు ప్రజలకు సమాధానం చెప్పాలని రాంబాబు డిమాండ్ చేశారు. వాటి జోలికి వెళ్లకుండా వుండటానికి టిడ్కో ఇళ్ళు ఉగ్రవాదులు నిర్మించినవా? లేదా నిషిద్ధ భవనాలా? తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.