ప్రభుత్వం సబ్సిడీ పై అందిస్తున్న టమాటాలు నిడదవోలు ప్రజలకు అందుబాటులో ఎప్పుడు?

ప్రభుత్వం సబ్సిడీ పై అందిస్తున్న టమాటాలు నిడదవోలు ప్రజలకు అందుబాటులో ఎప్పుడు?

ఏపీ పబ్లిక్ న్యూస్, నిడదవోలు : నిత్యవసర కూరగాయలలో అతి ముఖ్యమైనవి ఉల్లిపాయ, టమాటా. దేశంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల టమాటా పంటలు దెబ్బతిన్నాయి. దీనికి తోడు పంటకు తెగుళ్లు సోకడంతో దిగుబడులు కూడా బాగా తగ్గాయి. ఈ కారణంతో టమాటా రేట్లు ఆకాశం ఉంటాయి. 100 నుండి 150 రూపాయలు వరకు కిలో టమాటా ధర ఉండడంతో నిత్యం మనం తినే ఆహారంలో టమాటా నిత్య అవసరం కాబట్టి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రజల ఇబ్బందిని గుర్తించి ప్రభుత్వం అంత భారం ప్రజలపై పడకుండా సబ్సిడీ పై కిలో టమాటా రూ.50 లకే అందిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 3వ తేదీ నుండే అమ్మకాలను ప్రారంభించారు.

అయితే నిడదవోలులో సబ్సిడీపై టమాటా అమ్మకాలు అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం మన జిల్లాలో వేసిన టమాటా పంట నారుమడుల దశలోనే ఉండడంతో టమాటా పంట రావడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుంది. కాబట్టి టమాటా ధర తగ్గడానికి ఇంకా నెల లేదా 2 నెలలు సమయం పడుతుంది. ఈ విషయంపై ప్రజా నాయకులు, సంబంధిత అధికారులు, వెంటనే స్పందించి సబ్సిడీ కి టమాటాలు అందించాలని నిడదవోలు ప్రజలకు కోరుతున్నారు.