ఏపీ పబ్లిక్ న్యూస్ వెబ్ లో రాసిన వార్తకు స్పందించిన మునిసిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్

ఏపీ పబ్లిక్ న్యూస్ వెబ్ లో  రాసిన వార్తకు స్పందించిన మునిసిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్

పేదల ఇళ్ల నిర్మాణంలో లోపాలు ఉంటే కఠిన చర్యలు తప్పవు 

నిర్మాణాలలో లోపాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయండి

నిర్మాణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తాం

మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ


ఏపీ పబ్లిక్ న్యూస్ : నిడదవోలు జగనన్న కాలనీలో నిర్మాణాల నాణ్యత లోపాలపైన నేడు 26 జులైన ఏపీ పబ్లిక్ న్యూస్ వెబ్ లో రాసిన "నిరుపేదల ఇళ్ల భవిష్యత్తు ఏమిటి?" వార్తపై వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ పద్మావతి, నిడదవోలు జగన్ కాలనీలో ఇళ్ళు నిర్మిస్తున్న తాపీ మేస్త్రులు, కాంట్రాక్టర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వారికి హెచ్చరికలు జారీ చేశారు.

నిర్మాణాల పై అవగాహన లేని నిరుపేదలు లబ్ధిదారులకు నిర్మించే ఇళ్ళు నాణ్యత లోపాలను గమనిస్తే కఠిన చర్యలు తప్పవని, అటువంటి వారిపై పోలీస్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

లబ్ధిదారులు గృహ నిర్మాణ సమయంలో దగ్గరుండి పర్యవేక్షించుకోవాలని, నిర్మాణంలో ఎటువంటి లోపాలను గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.

అలాగే వెంటనే కాలనీలోని గృహాలను ఇన్స్పెక్షన్ చేసి లోపాలు గుర్తించాలని హౌసింగ్ ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్ లను మున్సిపల్ కమిషనర్ పద్మావతి ఆదేశించారు.

నిర్మాణాలపై అవగాహన లేని లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తామని, లోపాలు లేని నిర్మాణాలు కట్టే విధంగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ హామీ ఇచ్చారు.

ఈ సమావేశములో మునిసిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మునిసిపల్ కమీషనర్ పద్మావతి, హౌసింగ్ డిఈఈ చంద్రశేఖర్, హౌసింగ్ ఏఈ రత్నాగిరి, వర్క్ ఇన్స్పెక్టర్ సువర్ణ రాజు, వార్డు ఏమినిటీస్ మరియు హౌసింగ్ కాంట్రాక్టర్లు హాజరు అయినారు.