కాలేజీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వాలి - SFI ఆధ్వర్యంలో నిడదవోలు విద్యార్థుల ఆందోళన

కాలేజీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వాలి - SFI ఆధ్వర్యంలో నిడదవోలు విద్యార్థుల ఆందోళన


ఏపీ పబ్లిక్ న్యూస్ : నిడదవోలులో భారత విద్యార్థి ఫెడరేషన్ SFI ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలని నిడదవోలు స్ధానిక గణేష్ చౌక్ సెంటర్లో SFI నాయకులు, విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు లేక చదువుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని పాఠ్య పుస్తకాలు ఇవ్వక ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఉత్తీర్ణత శాతం 36% మాత్రమే ఉందని దీనికి ప్రధాన కారణం పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోవడమే అని అన్నారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యహన భోజన పథకం తిరిగి  ప్రారంభించాలని, పాఠ్య పుస్తకాలు వెంటనే అందించాలని మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 4000 లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు

ఇప్పటికే ప్రభుత్వానికి, పాలకులకు, విద్యాశాఖ అధికారులకు అనేక వినతి పత్రాలు అందించమని, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేశామని, ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో SFI నాయకులు శశి, హరి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.