జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభించిన నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు

జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభించిన నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు 


ఏపీ పబ్లిక్ న్యూస్, అక్టోబర్ 8 : ఉండ్రాజవరం మండలం మొర్త గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, సుపరిపాలన, అభివృద్దే లక్ష్యoగా పరిపాలన సాగిస్తూ, ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యoతో ప్రతి పౌరుడికి ఇంటి వద్దనే సీనియర్ వైద్యులతో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, ఉచితంగా చికిత్స మందులు అందజేస్తారని తెలిపారు ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరికీ అవసరమైనటువంటి వివిధ అనారోగ్యాలకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి ప్రతి ఒక్కరికి ఆ అనారోగ్యానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ పై పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ప్రజలందరూ వచ్చి ఈ యొక్క క్యాంపును ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ ,డంట్లిస్ట్, జనరల్ అండ్ గైనిక్, ఆప్తమాలజిస్ట్, స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొన్నారు. అలాగే 108 ద్వారా ఈసీజీ సేవలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్, గ్రామ ఎంపిటిసిలు, గ్రామ సొసైటి అధ్యక్షులు మండల ఎంపీపీ, జెడ్పీటీసీ, సచివాలయం కన్వీనర్లు, గ్రామ వైయస్ఆర్సిపి కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.