వేమగిరి గట్టుపై ప్రభుత్వ భవనాలు కూల్చివేతకు ఆదేశాలు...

వేమగిరి గట్టుపై ప్రభుత్వ భవనాలు కూల్చివేతకు ఆదేశాలు...



ఏపీ పబ్లిక్ న్యూస్, రాజమహేంద్రవరం, నవంబర్ 02:

జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం గా ఉండే వేమగిరి గట్టుపై ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ తక్షణం కూల్చి వేతకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి రత్నకుమారి ని తాశీల్డార్ సుజాత ఆదేశించారు. ఈ భవనాలను ఆనుకొని నాన్ అప్రువుల్ లే అవుట్ ఉంది. ఆ లేవుట్ స్థల యజమాని తన స్థలం లో ప్రభుత్వ భవనాలు కట్టేసారంటు ఏడాది తరువాత కడియం తాశీల్డార్ కు పిర్యాదు చేశారు. సర్వే చేసి 118 గజాల స్థలంలో ప్రభుత్వ భవనాలు నిర్మించినట్లు తాశీల్దార్ గుర్తించారు. ఇప్పటికే ఆ భవనాలు 50% పైగా నిర్మాణం పూర్తయ్యాయి. అయితే భవన నిర్మాణాలు నిలిపివేయాలని ఆక్రమిత భాగాన్ని కూల్చివేయాలని ఫిర్యాదుదారుడు కోరారని ఆ మేరకు చర్యలు తీసుకోవాలంటూ ఎంపీడీవోకి ఈ నెల 30న తాశీల్దార్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ సమస్యపై రాజమహేంద్రవరం వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, మండల సమన్వయకర్త యాదల సతీష్ చంద్ర స్టాలిన్ వేమగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెలుగుబంటి వెంకటాచలం తదితరులు సమస్య పరిష్కారం దిశగా ఆలోచిస్తుండగానే తాశీల్దార్ అత్యవసరంగా మండల ఇంజనీరింగ్ అధికారికి మరో సర్క్యులర్ జారీ చేశారు. భవనాలు కూల్చే వరకు కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వొద్దని సర్క్యులర్ లో ఆదేశాలు ఇచ్చారు.. రెండు రోజుల్లోనే రెండుసార్లు సర్క్యులర్స్ రావడంతో ఇంజనీరింగ్ అధికారులు నానా హైరానా పడుతున్నారు. ఓ పక్క ప్రయారిటీ బిల్డింగ్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో వేమగిరిలో ఎదురైన సమస్య వారికి చిక్కుముడిగా మారింది... వేమగిరి గట్టుపై మొదట్లో సచివాలయం నిర్మాణానికి ఓ స్థలాన్ని ఎంచుకోగా ఆ స్థలం తనదని ఓ మహిళ కోర్టుని ఆశ్రయించింది. దీంతో ఆ భవన నిర్మాణం ఆదిలోనే నిలిచిపోయింది. స్వయంగా జిల్లా కలెక్టర్ వేమగిరి లో పర్యటించి స్థల పరిశీలన చేసి వేరే స్థలాల కేటాయించాలని అప్పట్లో రెవెన్యూ, పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఉరుకులు, పరుగులపై స్థల నిర్ధారణ చేసి ధవలేశ్వరం సరిహద్దుల్లో జాయింట్ సర్వే చేయకుండానే స్థలాన్ని అప్పగించారు. ఇప్పుడు ఆ స్థలం కూడా వివాదాల్లో చిక్కుకోవడంతో గ్రామ సచివాలయం ,వైయస్సార్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం నిలిచిపోయింది.

పరిష్కారం దిశగా చందన సమాలోచనలు....

వేమగిరి గట్టుపై కోటి రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడడంతో మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త యాదలసతీష్ చంద్ర స్టాలిన్ ఈ సమస్యను కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. దళితవాడకు అతి సమీపంలో హెల్త్ క్లినిక్ సచివాలయం రైతు భరోసా కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని అటువంటి భవనాలకు కూల్చివేతకు ఎందుకు అధికారులు తొందర వ్యక్తం చేస్తున్నారని పరిష్కారం దిశగా ఎందుకు ఆలోచించకూడదని స్టాలిన్ ,మాజీ సర్పంచ్ డాక్టర్ వెంకటాచలం,దళిత నాయకులు బడుగు ప్రశాంత్ కుమార్, విప్పర్తి ఫణి కుమార్ తదితరులు చందన దృష్టికి తీసుకువెళ్లారు. స్థలం నష్టపోయిన వ్యక్తికి వేరే ప్రదేశంలో స్థలం కేటాయిస్తే సమస్య పరిష్కారం అవుతుందని దళిత నాయకులు చందనకు సూచించారు. ఆ దిశగా ప్రయత్నాలు మాని నిర్మాణాలు నిలిపివేయడం తగదని వివరించారు. కోఆర్డినేటర్ చందన కూడా ఈ భవన నిర్మాణాలు అవసరమని పరిష్కారం కోసం తాను ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఆక్రమిత స్థలం ధవలేశ్వరంలో ఉండటం వల్ల రూరల్ తాశీల్దార్ని కూడా సంప్రదించి జాయింట్ సర్వే చేయించి తగు చర్యలకు ముందుకెల్లెందుకు యోచన చేస్తున్నారు.