విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై సమగ్రవిచారణ జరపాలి

విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై సమగ్రవిచారణ జరపాలి..

  • మత్తు పదార్థాలను ఆదాయ వనరులుగా చూస్తున్న వైసీపీ ప్రభుత్వం

• తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లో విదేశాలకు డ్రగ్స్ మాఫియా జరుగుతుంది......గోరంట్ల


ఏపీ పబ్లిక్ న్యూస్ : రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా 

రాజమండ్రి, మార్చి 22 : బ్రెజిల్ శాంటోష్ పోర్ట్ నుంచి విశాఖ పోర్టుకు చేరుకున్న 25వేల కిలోల డ్రగ్స్ రాకెట్ పై సమగ్ర విచారణకు ఆదేశించాలని కేంద్రప్రభుత్వాన్ని టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. విశాఖ పోర్టులో తనిఖీలకు వచ్చిన సిబిఐ ,కష్టమ్స్ అధికారులను కంటైనర్ తెరవకుండా ఆపడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నం చేశారని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రిలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడిన గోరంట్ల డ్రగ్స్ దిగుమతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండానే ఇన్ని వేల కోట్ల మాదకద్రవ్యాలను డ్రై ఈస్ట్ పేరుతో దిగువమతి చేశారా అని అన్నారు. గతంలో అనేక మార్లు మాదకద్రవ్యాలు దిగుమతి అయినట్టు ఆరోపణలు వచ్చాయని,వాటి పై విచారణ ఏమైందో తెలియదని, అయితే ఇపుడు విశాఖ తీరానికి చేరిన కంటైనర్ డ్రగ్స్ ను చూస్తుంటే ఇదేదో చిన్న విషయం కాదన్నారు. దీని వెనుక ఏదో రాకెట్ దాగివుందని, చేపల మేత తయారీలో వినియోగించే డ్రైఈస్ట్ పేరుతో దిగుమతి చేసుకున్న కంపెనీ వ్యవహారాలు వెనుక ఎవరున్నారు.దీనికి కారకులు ఎవ్వరో , ఆ సంస్థకు యజమానులెవ్వరో బయటకు తీయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. వేల కిలోల వంతున డ్రగ్స్ రాష్ట్రానికి వస్తుంటే... రాష్ట్రంలో యువత ఏమైపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో గెలవడం కోసం ప్రభుత్వమే డ్రగ్స్ రప్పించదా అనే అనుమానాలు కలుగుతున్నాయని గోరంట్ల అన్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకునే సమయంలో ఏపీ పోలీసులు పోర్టు అధికారులు సహకరించకపోవడంతోనే ఏదో కుట్ర వుందని, అందుకే డ్రగ్స్ వ్యవహారంపై మొత్తానికి సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలకితీయాలని గోరంట్ల కేంద్రప్రభుత్వాన్ని కోరారు. 

ఇక రాజమండ్రిలో గంజా, బ్లేడ్ బ్యాచ్ లను రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామే పోషిస్తున్నారని,తనకు ఏమీ సంబంధంలేని విషయంలో నన్ను లాగితే ఊరుకునేదిలేదని గోరంట్ల అన్నారు.గంజాయి కేసులో దొరికిన వ్యక్తి ఎంపీ అనుచరుడు కాదా అని ఆయన ప్రశ్నించారు. వారు చేసిన తప్పులను వేరొకరి మీదకు నెట్టేయడం వారికి అలవాటేనని ఎంపీ భరత్ పై ఆగ్రహాం వ్యక్తం చేశారు.