నిడదవోలు, జగనన్న కాలనీలో సర్వ మత సమ్మేళనంతో గణపతి నవరాత్రులు

నిడదవోలు, జగనన్న కాలనీలో సర్వ మత సమ్మేళనంతో గణపతి నవరాత్రులు


ఏపీ పబ్లిక్ న్యూస్, నిడదవోలు, 16 సెప్టెంబర్ 2024 :

నిడదవోలు YSR నగర్ వెనుక గల జగనన్న కాలనీలో మొదటి సారిగా గణపతి నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహించారు. సోమవారం వినాయకుడి ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమంలో జగనన్న కాలనీలోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్న విభేదాలు లేకుండా పిల్లలు, మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణ :

సర్వ మత సమ్మేళనంగా గణపతి నవరాత్రులు నిర్వహించడం ఇక్కడ అందరిని ఆకర్షస్తుంది. 10 రోజులుగా జరిగిన పూజలలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాల వారు స్వామి వారికి ప్రసాదం అందించడం విశేషం. కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వారు కమిటీగా ఏర్పడి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం మంచి శుభ పరిణామం అని అందరూ కలిసి మెలిసి ఉండడం ఎంతో ఆనందదాయకం అని కాలనీ వసూలు తెలియచేస్తున్నారు. అన్ని మతాల వారి పండుగలు ఇలాగే కుల మతాలకు అతీతంగా జగనన్న కాలనీలో నిర్వహిస్తామని ఈ కమిటీ సభ్యులు తెలియచేస్తున్నారు.

జగనన్న కాలనీ కమిటీ :

జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు అయినా రోడ్లు, డ్రైన్లు, వాటర్ పరిస్థితి గురించి మీడియా ప్రశ్నించ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంది, జగనన్న కాలనీకి మౌలిక సదుపాయాలు అన్ని కూడా ఈ ప్రభుత్వంలో కల్పిస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం అని కమిటీ సభ్యులు తెలియచేసారు. త్వరలో కాలనీ వాసులతో బలమైన కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, మంత్రి గారిని కలిసి తమ కాలనీ పరిస్థిస్తులు వివరిస్తామని, కాలనీ డెవోలప్మెంట్ కు మంత్రి కందుల దుర్గేష్ గారు పూర్తి సహకారం అందిస్తారని ధీమా వ్యక్తం చేసారు. 

కొలహాలంగా వినాయక ఊరేగింపు, నిమర్జనం :

ఆదివారంతో వినాయకుడికి 9 రోజులు పూజలు పూర్తి చేసి 10వ రోజు సోమవారం ఉదయం 10గంటలకు మొదలైన వినాయకుడి ఊరేగింపు జగనన్న కాలనీలో వీధి, వీధి ఊరేగించి సాయంత్రం 5గంటలకు బసివిరెడ్డి పేటలో వెంకటేశ్వర స్వామి స్నానంఘట్టం వద్ద నిమజ్జనం జరిగింది.

శ్రీ వినాయక ఉత్సవ కమిటీ :

జగనన్న కాలనీలో గణపతి నవరాత్రులు మొదటి వార్షికోత్సవం కమిటీ ప్రెసిడెంట్, పొన్నాడ నాని, వైస్ ప్రెసిడెంట్, వాండ్ర శాంయేలు రాజు, సెక్రటరీ, కారింకి వెంకట్ రాజు (బాబీ), జాయింట్ సెక్రటరీ, ర్యాలీ బ్రహ్మానందచార్యులు (ఆనంద్), ట్రెజరర్, బర్నికాన సత్తిబాబు, కమిటీ సభ్యులు బుసరపు వెంకట సత్యనారాయణ (ఫ్రూట్స్ బాబీ), కారింకి శివ స్వామి, పోలిమటి మూర్తి కుమార్, పొన్నాడ దుర్గా ప్రసాద్, నైదాని సాయికుమార్, వానపల్లి సాయికుమార్, సయ్యద్ ఇబ్రహీం, షేక్ రహీమ్, షేక్ సుభాని, షేక్ అబ్దుల్ రహీమ్, షేక్ సలీం కమిటీ సభ్యులుగా ఉన్నారు.